English   

స్టార్ అయిపోయిన బెల్లంకొండ.. ఇదిగో సాక్ష్యం..!

Bellamkonda Srinivas
2018-02-17 18:24:36

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ కూడా లేక‌పోయినా కూడా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. స్టార్ హీరోల సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో ఈయ‌న సినిమాలు వ‌స్తుంటాయి. ఇంకా చెప్పాలంటే ప్ర‌తీ సినిమాతో స్టార్ హీరోలు కూడా ఈర్ష్య ప‌డేలా వ‌స్తుంటాడు ఈ కుర్ర హీరో. ఇప్పుడు కూడా శ్రీ‌వాస్ తో చేస్తోన్న సాక్ష్యం భారీ బ‌డ్జెట్ సినిమానే. అల్లుడుశీను ఏకంగా 40 కోట్ల‌తో నిర్మించాడు బెల్లంకొండ సురేష్. ఈ చిత్రం ఓవ‌ర్ బ‌డ్జెట్ కార‌ణంగా ఫ్లాప్ అయింది కానీ ఈ కుర్రాడికి మాత్రం బాగానే గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఆ త‌ర్వాత స్పీడున్నోడు చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఈ మ‌ధ్యే బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో జ‌య జాన‌కి నాయ‌కా సినిమా చేసాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. ఈ చిత్రం కాస్ట్ ఫెయిల్యూర్ అయింది కానీ ఈ కుర్రాడి కెరీర్ కు బాగానే హెల్ప్ అయింది. జ‌య జాన‌కీ నాయ‌కా సెట్స్ పై ఉన్న‌పుడే.. సాక్ష్యం సినిమా క‌మిట‌య్యాడు శ్రీ‌నివాస్. ఇది చాలా కొత్త కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతోంది. 

ఇందులో వీడియో గేమ్స్ త‌యారు చేసే పాత్ర‌లో న‌టిస్తున్నాడు బెల్లంకొండ‌. చిన్న‌పుడే అమ్మానాన్న‌ల్ని పోగొట్టుకున్న పాత్ర ఇది. ఈ కుర్రాడికి పంచ‌భూతాలే సాక్ష్యం.. పోరాడినా.. గెలిచినా అన్నింటికీ ఆ పంచ‌భూతాలే సాక్ష్యం అన్న‌మాట‌. వాటితోనే త‌మ హీరో పోరాటం అంటున్నాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్. సాక్ష్యం ఈ ఏడాది స‌మ్మ‌ర్లో విడుద‌ల కానుంది. పైగా శ్రీ‌వాస్ కు ల‌క్ష్యం.. లౌక్యం.. లాంటి రెండ‌క్ష‌రాల టైటిల్స్ బాగా క‌లిసొచ్చాయి. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ప్ల‌స్ కాన్సెప్ట్ పోస్ట‌ర్ చూస్తుంటే ఏదో భిన్న‌మైన ప్ర‌య‌త్నంగా అనిపిస్తుంది. పైగా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా 8 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. స్టార్ హీరోల సినిమాల రేంజ్ ఇది. దీనికి కార‌ణం బెల్లంకొండ న‌టించిన అల్లుడుశీను, జ‌య జాన‌కి నాయ‌కా హిందీ వ‌ర్ష‌న్స్ టీవీల్లో పెద్ద హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు సాక్ష్యం సినిమాకు కూడా భారీ రేట్ ఇచ్చారు. మ‌రి రేపు థియేట‌ర్స్ లోనూ ర‌చ్చ చేసి తాను నిజంగానే స్టార్ అని సాక్ష్యం చూపిస్తాడో లేదో ఈ బెల్లంకొండ చూడాలి..!

More Related Stories