English   

బెల్లంకొండ సంతోషం.. ఇదిగో సాక్ష్యం..!

Bellamkonda Srinivas Kajal Aggarwal Perticipated KiKi Challenge
2018-08-13 06:46:31

ఒక‌టి రెండు కాదు.. వ‌ర‌స‌గా చేసిన నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా బెల్లంకొండ శ్రీ‌నివాస్ లో ఏ మాత్రం జోష్ త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు మ‌ళ్లీ కొత్త సినిమాతో బిజీ అయ్యాడు ఈ కుర్ర హీరో. హీరోయిన్ కాజ‌ల్ తో క‌లిసి కికి ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ తెర‌కెక్కిస్తోన్న సినిమా సెట్ లో యాక్ష‌న్ ఎపిసోడ్ షూట్ చేస్తూ.. మ‌ధ్య‌లో ఈ కికి చాలెంజ్ చేసాడు బెల్లంకొండ‌. కాజ‌ల్ తో క‌లిసి డాన్సులు చేసి.. సేఫ్ డ్రైవింగ్ అంటూ మెసేజ్ లు కూడా ఇస్తున్నాడు ఈ హీరో. బెల్లంకొండ తీరు చూస్తుంటే సాక్ష్యంను పూర్తిగా బుర్ర‌లోంచి తీసేసిన‌ట్లే క‌నిపిస్తుంది. అంతేలే.. అన‌వ‌స‌రంగా ఫ్లాప్ ను బుర్ర‌లో పెట్టుకుంటే ఇప్పుడు చేస్తోన్న సినిమాపై ఆ ప్ర‌భావం ప‌డుతుంది.

అందుకే ఏ టెన్ష‌న్ లేకుండా అటెన్ష‌న్ తో శ్రీ‌నివాస్ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ‌. కాజ‌ల్ కూడా కావాల్సినంత స‌పోర్ట్ ఇస్తుంది ఈ కుర్రాడికి. ఇద్ద‌రూ క‌లిసి కీకీ ఛాలెంజ్ ఇర‌గ‌దీసారు. ఈ సినిమా కోసం పూర్తిగా లుక్ మార్చేసాడు ఈ కుర్ర హీరో. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలో లేన‌ట్లు ఇందులో క‌నిపిస్తున్నాడు. ఇదే ఏడాది ఈ చిత్రం విడుద‌ల కానుంది. ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం వ‌స్తుంది. కెరీర్ మొద‌లుపెట్టిన త‌ర్వాత కొత్త ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌డం బెల్లంకొండ‌కు ఇదే తొలిసారి. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ డైరెక్ట‌ర్ల‌ను న‌మ్ముకున్నా ఒక్క‌రు కూడా హిట్ ఇవ్వ‌లేదు.. మ‌రి ఇప్పుడు కొత్త వాళ్లైనా హిట్ ఇస్తారో లేదో చూడాలి..!

More Related Stories