English   

ఫంక్ష‌న్ అయిపోయిన త‌ర్వాత పార్టీ.. 

Bharat-Ane-Nenu

ఇండ‌స్ట్రీలో మారుతున్న ప‌రిస్థితులు చూసి పండ‌గ చేసుక‌కుంటున్నారు అభిమానులు. ఒకేసారి స్టార్ హీరోలంతా క‌లిసిపోవ‌డం.. లేదంటే మ‌ల్టీస్ స్టార‌ర్ క‌థ‌ల‌కు ఓకే చెప్ప‌డం.. ఓ హీరో ఆడియో వేడుకకు మ‌రో హీరో రావ‌డం.. ఇలా ఒక్కొక్క‌టిగా మారిపోతున్నాయి ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితులు. ఇది నిజంగా మంచి హెల్ప్ అవుతుంది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కూడా. ఇప్పుడు స‌రైన క‌థ తీసుకెళ్తే ఎలాంటి హీరోలైనా క‌లిసి న‌టిస్తార‌ని అర్థ‌మైపోతుంది. దీనికి రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ నిద‌ర్శ‌నం. ఇక ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను బ‌హిరంగ‌స‌భ అయిపోయిన త‌ర్వాత మ‌హేశ్.. ఎన్టీఆర్.. రామ్ చ‌ర‌ణ్.. ముగ్గురు క‌లిసి పార్టీ చేసుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చాయి. ఇవి చూసిన త‌ర్వాత ఇండ‌స్ట్రీలో హీరోలు ఎంత పాజిటివ్ వైబ్రేష‌న్స్ తో ఉంటారో అర్థ‌మైపోతుంది. భ‌ర‌త్ అనే నేను బ‌హిరంగ స‌భ అయిపోయిన త‌ర్వాత ఆఫ్ట‌ర్ పార్టీ జ‌రిగింది. అక్క‌డికి మ‌హేశ్, ఎన్టీఆర్ తో పాటు మూడో వ్య‌క్తి కూడా జాయిన్ అయ్యాడు. అత‌డే రామ్ చ‌ర‌ణ్. ముందు ఈ వేడుక‌కు చ‌ర‌ణ్ కూడా రావాల్సి ఉంది. కానీ ప్రీ రిలీజ్ వేడుకకు రామ్ చ‌ర‌ణ్ ను తీసుకెళ్తున్నాడు మ‌హేశ్. అందుకే ఒకేసారి ఎన్టీఆర్ చ‌ర‌ణ్ ను వాడేసేకంటే.. ఒక్కోసారి విడివిడిగా వాడుకోవాల‌ని ఫిక్స్ అయిపోయాడు. కానీ పార్టీ మాత్రం అంతా క‌లిసే చేసుకున్నారు. మొత్తానికి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వ‌స్తున్న ఈ మార్పును చూసి అంతా ఫిదా అయి పోతున్నారు. ఇక అభిమానులు కూడా మ‌న హీరోల మాదిరే మారిపోతే ఎంత బాగుంటుందో క‌దా..?

More Related Stories