English   

భరత్ అనేనేను సెన్సార్ టాక్ వచ్చేసింది..?

mahesh-babu

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న భరత్ అనేనేను సెన్సార్ కంప్లీట్ అయింది. సెన్సార్ నుంచి భరత్ కు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సర్టిఫికెట్ తో పాటు సెన్సార్ నుంచి ఈ మూవీకి మరో బెస్ట్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. అదే సినిమా టాక్. మామూలుగా కొరటాల శివ సినిమాల్లో ఇప్పటి వరకూ మనం ఇంటర్నల్ గా మెసేజ్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా చూశాం. కానీ భరత్ అనేనేనులో ఇప్పటి వరకూ చూడని కొరటాలను చూస్తాం అనే టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందేనట. ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ ను చూడ్డం కోసమే ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ ఖాయం అంటున్నారు సెన్సార్ మెంబర్స్.. ఫస్ట్ హాఫ్ కొంత ఎంటర్టైనింగ్ గా సాగినా.. అక్కడ కూడా చాలా వరకూ ప్రాబ్లమ్స్ ను ఎలివేట్ చేసుకుంటూ వెళ్లి.. ఫైనల్ గా ఓ సాధారణ యువకుడు ముఖ్యమంత్రి అయ్యే వరకూ కథ సాగుతుంది. అయితే ఇంతర్వెల్ కు పావుగంట ముందు నుంచి సెకండ్ హాఫ్ లో గంట వరకూ సినిమా నెక్ట్స్ లెవెల్ ఉంటుందని టాక్. మొత్తంగా ఈ మూవీతో కొరటాల టెంపో పెంచేసినట్టే అంటున్నారు. అలాగే ఇప్పటి వరకూ వచ్చిన ఫ్లాపుల్ని మర్చిపోయేలా ఈ మూవీ మహేష్ కు డబుల్ హ్యాపీస్ ఇస్తుందంటున్నారు. సో.. సెన్సార్ టాక్ ను బట్టి మహేష్ భరత్ గా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడన్నమాట. 

More Related Stories