English   

 భ‌ర‌తా.. ఏంది నీ దూకుడు..? 

Bharat-ane-nenu
2018-04-24 10:46:12

భ‌ర‌త్ అనే నేనును ఏకంగా 100 కోట్ల‌కు అమ్మితే.. ఏంటా రేట్లు అస‌లే మ‌హేశ్ ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు.. అన్ని కోట్లు వ‌స్తాయా అని ఆశ్చ‌ర్య పోయారంతా. కానీ మూడు రోజులు అలా అయిపోయాయో లేదో చూస్తుండ‌గానే 60 కోట్లు వ‌చ్చేసాయి. అది కూడా గ్రాస్ కాదు.. షేర్. ఇప్పుడింకా రావాల్సిన బాకీ 40 కోట్లు మాత్ర‌మే. ఇప్ప‌టికీ వ‌సూళ్లు బ్ర‌హ్మాండంగా ఉన్నాయి. క‌చ్చితంగా తొలి వారంలోనే భ‌ర‌త్ అనే నేను ఈజీగా 80 కోట్ల మార్క్ అందుకునేలా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే చాలా చోట్ల ఈ సినిమా స‌గానికి పైగా పెట్టుబడులు వెన‌క్కి తీసుకొచ్చింది. ఓవ‌ర్సీస్ లో అయితే ఇప్ప‌టికే 2.6 మిలియ‌న్ అంటే.. 20 కోట్ల గ్రాస్ 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది. అక్క‌డ 18 కోట్ల‌కు ఈ సినిమాను అమ్మారు. ఈ రెండు మూడు రోజుల్లోనే అక్క‌డ సేఫ్ జోన్ కు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. కొర‌టాల మ్యాజిక్ కు తోడు మ‌హేశ్ న‌ట‌న ఈ చిత్రాన్ని మ‌రో రేంజ్ లో నిల‌బెట్టింది. వ‌ర‌స‌గా రెండు ప్లాపులు వచ్చినా కూడా మ‌హేశ్ ఇమేజ్ ఇంత కూడా త‌గ్గ‌లేద‌ని ఈ చిత్రం మ‌రోసారి నిరూపించింది. శ్రీ‌మంతుడు అప్ప‌ట్లో తొలివారంలో 57 కోట్ల షేర్ వ‌సూలు చేస్తే.. ఇప్పుడు మూడు రోజుల్లోనే దాన్ని దాటేసి 59 కోట్లు వ‌సూలు చేసాడు భ‌ర‌త్. మొత్తానికి ఈయ‌న దూకుడు చూస్తుంటే 100 కోట్లు దాటేసి.. కొన్ని కోట్లు లాభాలు కూడా తెచ్చేలా క‌నిపిస్తున్నాడు. 
 

More Related Stories