English   

ఇన్ని స్టంట్లు అవసరమా భరత్.. 

mahesh-babu
2018-04-30 06:40:31

భరత్ అనేనేను.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా. అన్ని వర్గాల ఆడియన్స్ అదే టాక్ చెప్పలేదు కానీ.. మెజారిటీ ఆడియన్ ఒపీనియన్ మాత్రం ఇదే. హిట్ టాక్ వచ్చిన సినిమాకు ఇంకా ప్రమోషన్ చేస్తే కలెక్షన్ లు మరింత పెరుగుతాయి. ఇది అందరికీ తెలుసు. కానీ భరత్ అనేనేనుకు చేస్తోన్న ప్రమోషన్స్ మాత్రం సినిమా స్టంట్స్ ను తలపిస్తున్నాయి. ఇది చాలామంది చెబుతోన్న మాట. నిజమే.. సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఇక జనాలు చూసుకుంటారు కదా.. కానీ పదేపదే సక్సెస్ మీట్స్ పెట్టి మా సినిమా బ్లాక్ బస్టర్ మా సినిమా బ్లాక్ బస్టర్ అని ఊదరగొట్టడం దేనికి సంకేతం..? ఇక మహేష్ బాబు లాంటి క్రౌడ్ పుల్లర్ ఉండగా ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్ చేత కూడా మరో ప్రమోషనల్ స్టంట్ ‘చేయించారు’. సరే కెటిఆర్ కు సినిమాలంట ఇంట్రెస్ట్ ఉంది. మహేష్ బాబు అంటే అభిమానం ఉంది అనుకుందాం.. అందుకే చేశాడనుకోవచ్చు. కానీ ఈ ప్రమోషన్స్ లో సినిమాల కంటే ఎక్కువగా ముఖస్తుతి వినిపిస్తోంది. ఒకరినొకరు పొగుడుకోవడానికే తప్ప.. మరింకేం పనిలేనట్టుగా సాగుతోంది వ్యవహారం. 

నిజానికి భరత్ అనేనేనులో కథపరమైన మిస్టేక్స్ చాలా ఉన్నాయి. కానీ మహేష్ గత సినిమాలు బ్రహ్మెత్సవం, స్పైడర్ లతో పోల్చుకుంటే చాలా బెటర్ అనే టాక్ మాత్రమే వచ్చింది. ఆ టాక్ ను బ్లాక్ బస్టర్ గా మార్చి.. ఇలాంటి సిఎమ్ ను ఇంతకు ముందెప్పుడూ చూడలేదని ఊదరగొడుతన్నారు. బట్.. ఈ సిఎమ్ కొత్తగా చేసిందేం లేదనేది సినిమా చూసిన ఎవరికైనా అర్థమౌతుంది. ఒకే ఒక్కడు, లీడర్ లతో పాటు మరికొన్ని సినిమాలను మిక్స్ చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. పైగా సినిమా అంతా ఒకే మూడ్ లో సాగడం మైనస్. ఇక చాలా సన్నివేశాలు శ్రీమంతుడులో చూసినట్టే కనిపిస్తాయి. ఒకటీ రెండు తప్ప సూపర్ అని క్లాప్స్ కొట్టే సీన్సే లేవు. ఇక మాస్ ఆడియన్స్ లోనైతే భరత్ కు పెద్దగా మార్కులూ పడలేదు. అయినా సినిమా బ్లాక్ బస్టర్ అంటూ వీళ్లు చెబుతోన్న లెక్కలు మాత్రం ఆశ్చర్యంగానే ఉన్నాయి.

అయితే ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న రంగస్థలం సినిమాకు సంబంధించినన వ్యవహారమంతా ఇందుకు భిన్నంగా జరిగింది. హిట్ టాక్ వచ్చిన తర్వాత ఫార్మల్ గా సక్సెస్ మీట్ జరిపారు. పవన్ కళ్యాణ్ వచ్చాడు.. తర్వాత ఆ సినిమా ప్రమోషన్స్ ను ఎవరూ పట్టించుకోలేదు. అయినా ఏకంగా 200కోట్ల గ్రాస్ వసూలు చేసి సత్తా చాటిందా సినిమా. ఆ మార్క్ ను దాటడానికే ఇప్పుడు భరత్ అనేనేను టీమ్ ఇన్ని స్టంట్స్ చేస్తోందనే విమర్శలూ వస్తున్నాయి. ఏదేమైనా మహేష్ బాబు వంటి స్టార్ హీరో తన సినిమా బ్లాక్ బస్టర అని ఇంతలా డప్పు కొట్టి చెప్పడం, చెప్పించడం చూస్తుంటేనే అర్థమౌతోంది.. అసలు భరత్ ఇన్ని స్టంట్స్ ఎందుకు చేస్తున్నాడో అని. మరి ఈ స్టంట్స్ ఇంకెన్ని రోజులు కంటిన్యూ చేస్తారో చూడాలి.

More Related Stories