English   

భ‌ర‌త్ అనే నేను.. 3 మిలియ‌న్ కొట్టాను..!

Bharat-Ane-Nenu
2018-05-01 09:23:25

ఒక‌ప్పుడు తెలుగు సినిమాకు ఓవ‌ర్సీస్ లో 1 మిలియ‌న్ అనేది క‌ల‌. అక్క‌డ మిలియ‌న్ డాల‌ర్లు వ‌స్తే హీరోలు కాల‌ర్ ఎగ‌రేసుకుని తిరిగేవాళ్లు. ఆ త‌ర్వాత అది 1.5 మిలియ‌న్ కు చేరింది. మెల్ల‌గా ల‌క్ష్యం 2 మిలియ‌న్ కు వ‌చ్చింది. ఇప్పుడు 2.5 కూడా దాటేసి.. స్టార్ హీరోల సినిమాల‌కు క‌నీసం 3 మిలియ‌న్ అనేది టార్గెట్ గా మారింది. అది సాధించ‌క‌పోతే అక్క‌డ పెట్టిన రేట్ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. మొన్న రంగ‌స్థ‌లం 3 మిలియ‌న్ మార్క్ అందుకుని.. ఇప్పుడు 3.5 వైపు ప‌రుగులు తీస్తుంది. ఇక ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను కూడా 3 మిలియ‌న్ మార్క్ అందుకుంది. నెల రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు ఓవ‌ర్సీస్ లో 3 మిలియ‌న్ మార్క్ అందుకోవడం అనేది చిన్న విష‌యం కాదు. ఎందుకంటే బాహుబ‌లి త‌ర్వాత శ్రీ‌మంతుడు పేరు మీదున్న 2.89 మిలియ‌న్ మార్క్ అందుకోడానికి మ‌న హీరోల‌కు మూడేళ్లు ప‌ట్టింది. ఇప్పుడు నెల రోజుల గ్యాప్ లోనే వ‌చ్చిన రెండు పెద్ద సినిమాలు ఇలా 3 మిలియ‌న్ మార్క్ అందుకోవ‌డంతో పండ‌గ చేసుకుంటున్నారు నిర్మాత‌లు. ఇది రాబోయే సినిమాల‌కు కూడా పండ‌గే. నా పేరు సూర్య‌తో ఓవ‌ర్సీస్ లో మ్యాజిక్ చేయాల‌ని చూస్తున్నాడు బ‌న్నీ. మ‌రి చూడాలిక‌.. ఈ సీజ‌న్ లో మూడో 3 మిలియ‌న్ సినిమా బ‌న్నీ అందిస్తాడో లేదో..?

More Related Stories