English   

మహేష్ బాబుకు ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ 

Mahesh
2018-04-21 13:11:47

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనేనేనుకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆయన కెరీర్ లోనే ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కావడం విశేషం. మార్నింగ్ షో నుంచే సినిమాకు హిట్ టాక్ రావడంతో సాయంత్రానికి మరింతగా పికప్ అయ్యాయి కలెక్షన్లు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో కూడా మహేష్ కు మంచి ఓపెనింగ్సే రావడం విశేషం. వీటిలో ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భరత్.. నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేశాడు. కొరటాల శివ దర్శకుడు కావడం, ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు బిగ్గెస్ట్ హిట్ కావడం.. అలాగే మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడని తెలియడంతో ఈ మూవీకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.. ఆ రెస్సాన్సే కలెక్షన్ల రూపంలో కొత్త రికార్డులకు నాంది పలుకుతోంది. 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ షేర్స్ గా ఎలా ఉన్నాయో చూద్దాం.. 

నైజాం           - 5.55కోట్లు  షేర్
సీడెడ్              - 3.65 కోట్లు
యూ.ఏ           - 2.91 కోట్లు
వెస్ట్ గోదావరి     - 1.82 కోట్లు
ఈస్ట్ గోదావరి    - 3.20 కోట్లు
గుంటూర్         - 4.03 కోట్లు
కృష్ణా               - 1.92 కోట్లు
నెల్లూర్             - 0.88 కోట్లు 

టోటల్             - 23.05 కోట్ల షేర్ వసూలు చేసి సత్తా చాటింది భరత్ అనేనేను.

More Related Stories