English   

మహేష్ బాబు నవశకం అదిరింది

Bharat- Ane-Nenu

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. విరచిస్తా నేడే నవశకం.. నినదిస్తా నిత్యం జనహితం అంటూ సాగే ఈ పాట భరత్ విజన్ ను కూడా తెలియజేస్తోంది. ఒక ముఖ్యమంత్రిగా తానేం చెప్పాలనుకుంటున్నాడో, చేయాలనుకుంటున్నాడో చెప్పినట్టుగా ఉందీ పాట. అందుకే భరత్ అనేను హామీ ఇస్తున్నాను. బాధ్యుడ్నై ఉంటాను. ప్రజాస్వామ్య ప్రతినిధిలా ఉంటాను అంటున్నాడు. శ్రీ రామనవమి సందర్భంగా విడుదల చేసిన ఈ పాట మాంటేజ్ గా సాగుతుందని అర్థమౌతోంది. ఈ పాటను బట్టే రెగ్యులర్ పొలిటీషియన్ లా ఉండనని.. ప్రజలకు ప్రభువుగా కాకుండా బంటులా ఉంటానంటున్నాడు. ఇదంతా భరత్ పర్సెప్షన్ లోనే సాగే పాట. అది కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చేదిలా ఉంది.  రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీలోని ఆ పాటను రామజోగయ్య శాస్త్రి రాశాడు. డేవిడ్ సాల్మన్ పాడాడు. కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు నటించిన రెండో సినిమా ఇది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఒక బలమైన సోషల్ మెసేజ్ తో పాటు రాజకీయ ప్రక్షళన నేపథ్యంగా సాగే కథగా అర్థమౌతోంది. అయితే కరెంట్ పొలిటికల్ సినారియోపై అదిరిపోయే సెటైర్స్ కూడా ఉంటాయని టాక్. మొత్తంగా శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన ఈ పాటతో సినిమాలో పొలిటికల్ కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతోందో తెలుస్తోంది. ఏప్రిల్ 20న భరత్ అనే నేను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెలాఖరున 31న ఎల్బీ స్టేడియంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. 

More Related Stories