English   

భరత్ అనే నేను సూపర్ హిట్..?

Bharat-Ane- nenu
2018-04-18 18:22:04

భరత్ అనేనేను అంటూ అద్దిరిపోయే సౌండ్ తో మహేష్ బాబు చేసిన ప్రమాణమే ఈ సినిమా ఫలితాన్ని డిసైడ్ చేసింది. ఆ తర్వాత మాట ఇస్తే తప్పను అన్న ట్రైలర్ తోనే భరత్ బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నాడని అర్థమైపోయింది.. శ్రీమంతుడు తర్వాత మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న భరత్ అనేనుపై భారీ అంచనాలున్నాయి. మహేష్ బాబు గత రెండు సినిమాలు ఇబ్బందిపెట్టాయి. అందువల్ల ఈ సినిమా రిజల్ట్ పై చాలామందిలో ముఖ్యంగా అభిమానుల్లో ఒకరకమైన టెన్షన్ ఉంది. ఇక మీకు ఆ టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే సినిమా రిజల్ట్ వచ్చేసింది. 
 
చాలా సినిమాల రివ్యూస్ మనకు సెన్సార్ నుంచే తెలుస్తాయి. కానీ అన్ని సెన్సార్ రిపోర్ట్స్ ఒకలా ఉండవు. బట్.. దుబాయ్ సెన్సార్ నుంచి ఓ సినిమా టాక్ తెలిసిందంటే అది ఇక యూనివర్సల్. ఇప్పుడు భరత్ అనేనేను సినిమా రిజల్ట్ కూడా అక్కడి నుంచే వచ్చేసింది. అసలు ఈ సినిమా టాక్ గురించి చెబుతూ అక్కడి వాళ్లు ఊగిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. కొరటాల బలం కథ. దానికి బలమైన కథనం జోడించి మెస్మరైజ్ చేస్తుంటాడు. అలాగే ప్రతి సినిమాలోనూ మర్చిపోలేని కొన్ని బలమైన సన్నివేశాలుంటాయి. ఆ సీన్స్ గురించి రోజుల తరబడి చెప్పుకుంటారు ఆడియన్స్. అలాంటి సీన్స్ భరత్ లో చాలా అంటే చాలానే ఉన్నాయనే టాక్ దుబాయ్ నుంచి వినిపిస్తోంది. అలాగే కొరటాల సినిమాల్లో కనిపించే మరో స్పెషల్.. ఫైట్స్.. ఇందులోనూ అదిరిపోయే ఫైట్స్ ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఓ థియేటర్ లో ఉండే ఫైట్ హాంటింగ్ గా ఉంటుందనే టాక్ వచ్చేసింది.
 
మహేష్ బాబు ఫస్ట్ టైమ్ సిఎమ్ గా నటించాడీ సినిమాలో. మరి సిఎమ్ అంటే చిన్న విషయం కాదు కదా. బలమైన సీన్స్ ఉండాలి. మహేష్ స్టార్డమ్ కు తగ్గ సన్నివేశాలు పండాలి. అప్పుడే ఆ పాత్ర రక్తి కడుతుంది. అయితే ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ ను చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు మైమరచిపోతారట. ఆ స్థాయిలో ఆయన పాత్రను తీర్చిదిద్దాడట కొరటాల. డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. వీరి కెమిస్ట్రీ కూడా బావుందనే టాక్ వినిపిస్తోంది. ఇక రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ, దేవీ శ్రీ ప్రసాద్ ల సంగీతం  హైలెట్ గా చెబుతున్నారు.  మొత్తంగా మహేష్ బాబు కెరీర్ లో మరో ది బెస్ట్ మూవీగా భరత్ నిలవబోతోందని అందరూ చెబుతున్నారు. బెస్ట్ మూవీ మాత్రమే కాదు.. అదిరిపోయే కలెక్షన్స్ కూడా ఖాయం అంటున్నారు. సో.. భరత్ గా మహేష్ ఒక్కసారిగా తనతో పాటు అభిమానులూ కాలర్ ఎగరేసుకునేలా చేయబోతున్నాడనుకోవచ్చు.

More Related Stories