English   

భరత్ బ్లాక్ బస్టరా..?

Mahesh-babu
2018-04-20 20:53:53

భరత్ అనేనేను.. ఊహించినట్టుగానే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాడు. విడుదలై అన్ని చోట్లా ట్రెమండస్ రెస్పాన్స్ తో భరత్ దూసుకుపోతున్నాడు. ముఖ్యమంత్రిగా మహేష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. కొరటాల శివ డబుల్ హ్యాట్రిక్ కు గ్రాండ్ గా శ్రీకారం చుట్టాడనే టాక్ వస్తోంది. యూఎస్ లో ప్రీమియర్స్ తోనే కొత్త రికార్డులు సెట్ చేసిన భరత్.. ఇక్కడా ఎన్నో రికార్డులు షేక్ చేయబోతున్నాడు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు హిట్ టాక్ వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది భరత్ అనేనేను. నైజాం నుంచి నెల్లూర్ వరకూ, వైజాగ్ నుంచి ఓవర్శీస్ వరకూ.. ఊహించినట్టుగానే విడుదలైన అన్ని చోట్లా భరత్ ను బ్లాక్ బస్టర్ అనేస్తున్నారు ఆడియన్స్. ఇన్నాళ్లూ ఇలాంటి బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేసిన మహేష్ ఫ్యాన్స్ ఈ హిట్ తో పండగ చేసుకుంటున్నారు. మంచి కథ పడితే మహేష్ బాబు ఎలా చెలరేగిపోతాడో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ముందు నుంచీ ఆయన ఈ సినిమాపై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అలా ఎందుకున్నాడో ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అర్థమౌతోంది. ముఖ్యమంత్రిగా, అసెంబ్లీ సీన్స్ లో, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే కథలో మహేష్ డైలాగ్స్ కు విజిల్స్ పడుతున్నాయి.
 
స్టార్ కంటే కథను నమ్మి ఆ కథలో స్టార్ ఇమేజ్ ను ఇంప్లిమెంట్ చేయడం కొరటాల శివ తెలివి. ఆ తెలివి భరత్ కూ అదిరిపోయేలా వర్కవుట్ అయింది. కొరటాల మాటలకు చప్పట్లు పడుతున్నాయి. అసెంబ్లీసీన్స్ అయితే పీక్స్ అనే పేరొచ్చింది. ఇక కొరటాల శివ సినిమాల్లో కనిపించే ప్రత్యేకమైన అంశం ఫైట్స్.. రెగ్యులర్ ఫైట్స్ లా కాకుండా ఇవి కూడా కథలో మిక్స్ అయిపోయేలా ఉంటాయి. అలాఈ సినిమాలో కూడా రెండు ఫైట్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయంటున్నారు.. 
 
మహేష్ బాబు, కైరా అద్వానీల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. తెలుగులో ఫస్ట్ మూవీ చేసినా కైరా ఆకట్టుకుంది. నటన కూడా బావుంది. ఈ ఇద్దరి జంటా ఆన్ స్క్రిన్ పై ఫ్రెష్ గా ఉంది. నిజంగా దర్శకుడు కూడా ఈ ఫీలింగ్ కోసమే తనను తీసుకున్నాడేమో అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ అంటూ సెపరేట్ ట్రాక్ ఏం లేకపోయినా ఫస్ట్ హాఫ్ లో కథతోనే కావాల్సినంత వినోదం పండింది. తర్వాత పోసాని పాత్ర కూడా నవ్వించింది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఎప్పట్లానే సినిమాకు బ్యాక్ బోన్ లా నిలిచింది. ఇక రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ హైలెట్ అని చెప్పాలి. మొత్తంగా గత కొన్నాళ్లుగా మహేష్ బాబు అతని ఫ్యాన్స్ దేనికోసం చూస్తున్నారో దానికి మించిన విజయాన్ని భరత్ అందించాడు. తను కొరటాలపై పెట్టుకున్న నమ్మకాన్ని అతనూ నిజం చేశాడు.. సో ఈ సమ్మర్ కు భరత్ అనేనేనుతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చేసినట్టే. 

More Related Stories