English   

హమ్మయ్య.. భరత్.. భామతో కనిపించాడు.. 

Bharat-Ane-Nenu
2018-03-31 16:18:15

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ భరత్ అనేనేను. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ అన్నీ మహేష్ బాబు పిక్స్ మాత్రమే కనిపించాయి. చివరికి టీజర్, సాంగ్ లో కూడా మరో ఫేస్ ప్రధానంగా కనిపించలేదు. ముఖ్యంగా హీరోయిన్ మొహం అస్సలు కనిపించలేదు. అసలే కొత్త హీరోయిన్. ఆమెను మరీ లేట్ గా పరిచయం చేసినా ప్రాబ్లమ్ అవుతుంది. ఈ విషయంలో గత కొన్ని రోజులుగా చాలా గాసిప్స్ వినిపించాయి. అవి వారికి వరకూ వెళ్లాయో ఏమో.. అనౌన్స్ మెంట్ లేని రిలీజ్ డేట్ లా సడెన్ గా తన భామతో కలిసి సంప్రదాయంగా కనిపించాడు మహేష్ బాబు. 

కైరాతో కలిసి మహేష్ బాబు నడిచి వస్తోన్న పిక్ సూపర్ అనే చెప్పాలి. నీలిరంగు చీరకట్టుకున్న కైరా భుజంపై చేయి నడుస్తున్నాడు మహేష్. స్టిల్ చూడముచ్చటగా ఉంది. ఇప్పటి వరకూ కైరా పాత్ర ఎలా ఉంటుందా అనుకున్న వాళ్లకు ఈ స్టిల్ తో తను పూర్తిగా సంప్రదాయబద్ధమైన పాత్రలోనే కనిపించబోతోందనే క్లారిటీ వస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన భరత్ అనేనేను ఆడియో లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోతోంది. మహేష్, కొరటాల కాంబినేషన్ పై భారీ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే భరత్ అనేనేను బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడేమో చూడాలి. 

More Related Stories