English   

మహేష్ బాబు కొత్త సీన్స్ భలే ఉన్నాయే..? 

bharat-ane-nenu
2018-05-05 15:42:37

సినిమాకు నిడివి చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఒక్కొక్కసారి మంచి సీన్స్ కూడా సినిమాల లేకుండా పోతాయి. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోన్న భరత్ అనేనేనులో కూడా ఇలాంటి కొన్ని మంచి సీన్స్ మిస్ అయ్యాయి. సినిమాలో లేకపోయినా లేటెస్ట్ గా వీటిని యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. వ్యవసాయం, ఎడ్యుకేషన్ బేస్డ్ గా సాగే ఈ సీన్స్ కూడా భలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.  వర్షాధారిత ప్రాంతాల్లో రైతులను పూర్తి స్థాయిలో గైడ్ చేయాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖది. వర్షాలకు సంబంధించిన వివరాలతో పాటు నేల ప్రవృత్తికి తగ్గ పంటలు వేసుకునేలా రైతుల్ని ఎడ్యుకేట్ చేయడం వారి పని కూడా. కానీ ఈ విషయంలో వ్యవసాయశాఖ పని మనకు అనుకున్నంత గొప్పగా ఉండదు. ఆ సీన్ ను ఎలివేట్ చేసేలా ఓ వ్యవసాయశాఖ అధికారిని తీసుకుని వచ్చి పొలం దున్నుతోన్న రైతుతో ముఖ్యమంత్రి భరత్ మాట్లాడే సీన్ సినిమాలో లేదు. కానీ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఈ సీన్ చూడండి ఎంత బావుంటుందో.  ఉన్నవాడైనా లేనివాడైనా.. అందరికీ కావాల్సింది నాణ్యమైన విద్య. కానీ కొందరి స్వార్థం కారణంగా ప్రైవేట్ స్కూల్స్ పేరుతో విపరీతమైన దోపిడీ చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ అత్యంత అవినీతితో వేళ్లూనుకుని పోయి ఉంటుంది. అలాంటి స్కూల్స్ పై ముఖ్యమంత్రి భరత్ కొరడా ఝలిపిస్తాడు సినిమాలో. కానీ తర్వాత ఆ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆయన్ని కలుస్తాయి. అది సినిమాలో ఉండదు. మరి ఆ మీటింగ్ లో భరత్ రియాక్షన్ రీ సౌండ్ తో పాటుగా అదిరిపోయింది. 

More Related Stories