English   

వాటీజ్ దిస్ మహేష్ బాబు.. 

Bharat-Ane-Nenu
2018-04-14 15:01:54

సూపర్ స్టార్ మహేష్ బాబులో ఎంతమంచి నటుడు ఉన్నాడో అందరికీ తెలుసు. ఒకప్పుడు మంచి డ్యాన్సర్ కూడా. కానీ ఈ మధ్య డ్యాన్స్ అంటే చాలు.. మహేష్ బాబు కామెడీ చేస్తున్నాడు. అభిమానులు, ప్రేక్షకులు ఫీలైనా.. ఇది నిజం. బ్రహ్మోత్సవం నుంచి మొదలైన ఈ కామెడీ స్టెప్పులు ఇప్పుడు భరత్ లో కూడా మారలేదని తెలుస్తోంది. లుంగీ కట్టుకుని ఉన్న స్టెప్ ఇమేజ్ కూడా ఆర్టిఫిషియల్ గా ఉందనే టాక్ వచ్చింది. అయితే లేటెస్ట్ గా భరత్ అనేనేను వీడియో సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఇందులో ‘దేవదారూ శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా’ అంటూ సాగే ఈ పాటలో కూడా మహేష్ బాబు కామెడీ స్టెప్పులే వేశాడు. ఇప్పటికే అతని స్టెప్పులపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రాలాంగ్ నడుస్తోంది. ఇలాంటి టైమ్ ఇంకా ఫోటో షూట్ కు ఫోజులిస్తున్నట్టుగా ఉన్న స్టెప్పులే వేస్తే ఇంకా నవ్వుల పాలవుతారు. మరి మహేష్ ఎందుకు ఇలా చేస్తున్నాడో కానీ అతని స్టెప్పులు ప్రోమోలోనే పరమ రొటీన్ గా ఉన్నాయి.  ఇక మహేష్ స్టెప్పులు పక్కన బెడితే పాట బావుంది.. పాటలో హీరోయిన్  కైరా అద్వానీ కైపెక్కించేలానే ఉంది. అమ్మడు క్లీవేజ్ సొగసులు కూడా బాగానే ఆరబోసింది. మంచి స్టెప్పలు కూడా వేస్తోంది. మహేష్ పక్కన సెట్ అవుతుందా అనుకున్న వారిని ఆన్సర్ కూడా ఇచ్చేలానే ఉంది. అన్నీ బానే ఉన్నా.. మహేష్ బాబు స్టెప్పులే మళ్లీ దారుణంగా ఉన్నాయి.. మరి అతనే ఇలాంటి కంపోజింగ్ కోరుకుంటున్నాడా... లేక కొరియోగ్రాఫర్స్ అతనితో డ్యాన్స్ చేయించలేకపోతున్నారా..? అనేదే తెలియడం లేదు. బట్ మహేష్ బాబు ఒకప్పుడు ఎలాంటి స్టెప్పులు వేశాడు అనేది తెలుసు. అలాంటి అతను ఇప్పుడిలాంటి మూమెంట్స్ చేస్తున్నాడంటే ఆశ్చర్యంగానే ఉంది మరి.. 

More Related Stories