English   

భరత్ కు ‘స్పెషల్ షో’పర్మిషన్ గ్రాంటెడ్ .. 

Bharat-ane-nenu
2018-04-19 07:18:05

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనేనేను ఈ నెల 20న విడుదల కాబోతోంది. అయితే సినిమాకు స్పెషల్ షో(ప్రివ్యూ)స్ వేసుకునేందుకు తెలంగాణలో పర్మిషన్ రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక షోకు పర్మిషన్ ఇచ్చింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి 10గంటల లోపు ఒక ఆట ప్రదర్శించుకునేందుకు అనుమతినిచ్చింది. ఇది కేవలం ఒక్క రోజు మాత్రమే కాదు.. ఏకంగా ఎనిమిది రోజులు ప్రదర్శించుకోవచ్చు. అంటే ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ షో కోసం ప్రభుత్వానికి అదనంగా టాక్స్ కట్టాల్సి ఉంటుంది. సమ్మర్ లో వస్తోన్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రివ్యూస్ తో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అన్ని ఎడ్యుకేషన్ ఇన్సిస్టిట్యూట్స్ కు ఇప్పుడు పూర్తి స్థాయి హాలిడేస్ ఉన్నాయి. ఇది భరత్ కు బాగా కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి. ఇక కొరటాల శివ దర్శకుడు కాబట్టి భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకోవడంలోనూ ఈ స్పెషల్ షోస్ ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. పూర్తిస్థాయిలో పాజిటివ్ వైబ్స్ ఉన్న భరత్ కు ఎనిమిది రోజుల పాటు ప్రదర్శించే ఎక్స్ ట్రా షో ఎక్స్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎక్స్ ట్రా ఇన్ కమ్ నూ తెస్తుంది. 

More Related Stories