English   

ఎప్రిల్ 27.. మ‌హేశ్ అనే నేను ఫిక్స్.. 

Bharat-Ane-Nenu

అదేంటి టైటిల్ త‌ప్పు రాసారా అనుకుంటున్నారా.. లేదండీ మాకు క్లారిటీ ఉంది. మ‌హేశ్ అనే నేనునే. కాక‌పోతే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. భ‌ర‌త్ అనే నేనుతో మ‌హేశ్ అనే అత‌డు ఎప్రిల్ 27న రాబోతున్నాడు. ఇదే ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఎందుకంటే అదే రోజు అల్లుఅర్జున్ కూడా రాబోతున్నాడు. ఇప్పుడు కొత్త‌గా రేస్ లోకి ర‌జినీకాంత్ కూడా వ‌చ్చాడు. అయినా కానీ భ‌ర‌త్ అనేనేను మాత్రం ఎప్రిల్ 27నే రానుంద‌ని మ‌రో సారి క్లారిటీ ఇచ్చారు చిత్ర‌యూనిట్. స‌మ్మ‌ర్ లో యావ‌రేజ్ టాక్ వ‌చ్చిన సినిమాలు కూడా ఒక్కోసారి బ‌య‌ట‌ప‌డుతుంటాయి. బ‌న్నీ ప్ర‌తీసారి ఇదే చేసి హిట్ కొడుతున్నాడు. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, స‌రైనోడు లాంటి సినిమాలు మ‌రో టైమ్ లో వ‌చ్చుంటే ఫ‌లితం మ‌రోలా ఉండేది. డిజే కూడా సోసో టాక్ తోనే ప‌ర్లేద‌నిపించింది. అందుకే బ‌న్నీ త‌న ల‌క్ష్యం ఎప్పుడూ వేస‌వికే ఫిక్స్ చేసుకుంటాడు. స‌మ్మ‌ర్ 2018 కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న హీరో అల్లుఅర్జున్. ఓ ర‌కంగా చెప్పాలంటే స‌మ్మ‌ర్ కు ద‌త్త‌పుత్రుడు ఈ అల్లు వార‌బ్బాయి. 2014 నుంచి వ‌ర‌స‌గా స‌మ్మ‌ర్ లో వ‌స్తున్నాడు ఈ హీరో. రేసుగుర్రం.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి.. స‌రైనోడు.. డిజే.. ఇలా 2018లో నా పేరు సూర్య‌.. ఎప్రిల్ 27న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

సంక్రాంతికి రావాల‌నుకున్న మ‌హేశ్ భ‌ర‌త్ అను నేను స‌మ్మ‌ర్ కు వాయిదా ప‌డింది. స్పైడ‌ర్ కార‌ణంగా ఆల‌స్యం కావ‌డంతో ఈ చిత్రాన్ని వేస‌వికి వాయిదా వేసారు. బ‌న్నీతో పాటే.. అంటే ఎప్రిల్ 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే తాము వెన‌క్కి త‌గ్గేది లేద‌ని నా పేరు సూర్య నిర్మాత బ‌న్నీ వాసు తెలిపాడు. ఇక భ‌ర‌త్ అను నేను టీం కూడా వెన‌క్కి త‌గ్గేలా క‌నిపించ‌ట్లేదు. ఇవ‌న్నీ ఇలా ఉంటే ర‌జినీ కూడా ఇప్పుడు స‌మ్మ‌ర్ లోకే స‌డ‌న్ ఎంట్రీ ఇచ్చాడు. ఈయ‌న న‌టిస్తోన్న కాలా ఎప్రిల్ 27న విడుద‌ల కానుంది. అఫీషియ‌ల్ గా పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేసాడు నిర్మాత ధ‌నుష్. ఈ మూడు సినిమాల బిజినెస్ చూస్తుంటే ఈజీగా 500 కోట్లు దాటేస్తుంది. మ‌రి అంత బిజినెస్ ఒకేరోజు త‌ట్టుకుంటుందా..? ఆ ద‌మ్ము మ‌న బాక్సాఫీస్ కు ఉందా..? ఒకేసారి ముగ్గురు హీరోలొస్తే ర‌చ్చ మామూలుగా ఉంటుందా..? మొత్తానికి ఎప్రిల్ 27 మంట‌లు పుట్టిస్తుంది.

More Related Stories