English   

భరత్ అనేనేను 25న విడుదల

mahesh-ban-tamil
2018-05-18 09:10:35

అదేంటీ ఆల్రెడీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కూడా అయిన భరత్ అనేనేను మళ్లీ ఈ నెల 25న విడుదల కావడం ఏంటీ అనుకుంటున్నారా..? నిజమే.. రిలీజ్ అయింది.. హిట్ అయింది. అయినా రిలీజ్ అవుతోంది.. మళ్లీ ఇదేంటీ అంటారా.. ? అనండి.. ఎందుకంటే మీకు ఆన్సర్ ఇప్పుడే వచ్చేస్తుంది కాబట్టి.. ఇంతకీ మేటర్ ఏంటంటే.. భరత్ అనేనేను తమిళనాడులో ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఫస్ట్ రిలీజ్ టైమ్ లో చెన్నైలో కొన్ని థియేటర్స్ లో వేసినా.. అది తెలుగు వెర్షన్. ఇప్పుడు రిలీజ్ చేస్తోంది తమిళ్ లో. సో.. భరత్ అనునేను అక్కడ ‘భరత్ ఎనుం నానుం’ పేరుతో విడుదల కాబోతోంది. భరత్ చెన్నై లో 20థియేటర్స్  లోవిడుదల కాబోతుండటం విశేషం. అంటే ఇది చిన్న ఫిగరే అయినా.. మనవాళ్లకు అక్కడ పెద్దగా మార్కెట్ లేదు కాబట్టి.. ఒకరకంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదలవుతున్నట్టే.  ఇక మహేష్ బాబు స్పైడర్ సినిమాపై అక్కడ భారీ అంచనాలుండే. కానీ వాటిని అందుకోవడంలో స్పైడర్ ఫెయిల్ అయ్యాడు. దీంతో సూపర్ స్టార్ కోలీవుడ్ ఎంట్రీకి సూపర్ చాన్స్ మిస్ అయింది. మరి సూపర్ స్టార్ కే రెండు బ్రేక్స్ ఇచ్చిన కొరటాల శివ భరత్ ఎనుం నానుం అయినా మహేష్ మార్కెట్ ను పెంచుతుందేమో చూడాలి. 

More Related Stories