English   

నాన్ బాహుబ‌లి రికార్డులు సెట్ చేసిన భ‌ర‌త్.. 

bharat-ane-nenu

భ‌ర‌త్ అనే నేను.. ఇప్పుడు ఈ మాట‌లు టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్నాయి. మ‌హేశ్ బాబు వ‌ర‌స‌గా రెండు డిజాస్ట‌ర్లు ఇచ్చినా కూడా ఆయ‌న ఇమేజ్ ఇంత కూడా త‌గ్గ‌లేద‌ని భ‌ర‌త్ అనే నేను నిరూపిస్తుంది. ఈ చిత్ర టీజ‌ర్ కు అద్బుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. విడుద‌లైన ఒకే ఒక్క రోజులోనే ఏకంగా కోటి వ్యూస్ అందుకుంది ఈ విజ‌న్. ఇంకా చెప్పాలంటే 17 గంట‌ల్లోనే ఈ రికార్డ్ అందుకుంది. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో ఇది రికార్డ్. బాహు బ‌లి 2 ట్రైల‌ర్ కు ఒక్క‌రోజులో 2 కోట్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను టీజ‌ర్ కు మాత్రం కోటి వ్యూస్ దాటేసాయి. తెలుగులో నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో భ‌ర‌త్ విజ‌న్ నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉందిప్పుడు. దీనికంటే ముందు అజ్ఞాత‌వాసి ట్రైల‌ర్.. టీజ‌ర్ ఉండేవి. అజ్ఞాత‌వాసి ట్రైల‌ర్ కు ఒక్క రోజులో 74 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఇక టీజ‌ర్ కు కూడా 70 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. రంగ‌స్థ‌లం టీజ‌ర్ కూడా ఒక్క రోజులోనే 65 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ సాధించింది. ఇప్పుడు వీట‌న్నింటినీ దాటేసి ముందుకు దూసుకెళ్తున్నాడు భ‌ర‌త్ అనే నేను. ఈ టీజ‌ర్ రెస్పాన్స్ చూసి చిత్ర‌యూనిట్ కూడా సంతోషంలో తేలిపోతున్నారు. టీజ‌ర్ చూస్తుంటే సినిమా క‌చ్చితంగా మ‌రో శ్రీ‌మంతుడు అయ్యేలా ఉంది. కాక‌పోతే అప్పుడు గ్రామ‌ద‌త్త‌త అయితే.. ఇప్పుడు రాష్ట్ర‌ద‌త్త‌త అంతే..! న‌మ్మి ఓట్లేసిన ప్ర‌జ‌ల కోసం ఏదైనా చేసే ముఖ్య‌మంత్రిగా ఇందులో న‌టిస్తున్నాడు మ‌హేశ్. మ‌రి మ‌నోడి పాలిటిక్స్ ఎలా ఉండ‌బోతున్నాయో చూడాలిక‌..! ఎప్రిల్ 20న భ‌ర‌త్ అనే నేను విడుద‌ల కానుంది

More Related Stories