English   

మ‌హేశ్ అనే నేను.. హామీ ఇస్తున్నాను..!

Bharat-ane-nenu
2018-04-08 14:29:22

వ‌ర‌స‌గా రెండు ఫ్లాపులు.. దానికితోడు భ‌యంక‌ర‌మైన డిజాస్ట‌ర్లు.. భారీగా వ‌చ్చిన న‌ష్టాలు.. మ‌రోవైపు క‌థ‌ల ఎంపిక‌పై విమ‌ర్శ‌లు.. ఇలా అన్నింటి మ‌ధ్యా ఇరుక్కుపోయాడు ఇప్పుడు మ‌హేశ్ బాబు. ఆయ‌న క‌చ్చితంగా ఇప్పుడు హిట్ కొట్టాల్సిన ప‌రిస్థితుల్లో ఉన్నాడు. భ‌ర‌త్ అనే నేను వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొడితే కానీ ఈయ‌న మార్కెట్ మ‌ళ్లీ పైకి లేవదు. తాజాగా భ‌ర‌త్ అనే నేను ట్రైలర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత మ‌హేశ్ ఏదో మాయ చేస్తున్నాడ‌ని అర్థ‌మైపోతుంది. శ్రీ‌మంతుడు కాంబినేష‌న్ క‌చ్చితంగా మ‌రోసారి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేస్తారేమో అనిపిస్తుంది. పెద్ద సినిమా హిట్టైతే వ‌చ్చే రికార్డులు ఎలా ఉంటాయో ఇప్పుడు రంగ‌స్థ‌లం చూపిస్తుంది. దాంతో మ‌హేశ్ సినిమా కానీ ఆడితే 100 కోట్ల షేర్ ఈజీగా వ‌చ్చేస్తాయి. పైగా ఈ చిత్రం పొలిటిక‌ల్ ఎంట‌ర్ టైన‌ర్. ఈ మ‌ధ్యే వ‌చ్చిన రంగ‌స్థ‌లం కూడా గ్రామ రాజ‌కీయాలే కీల‌కంగా వ‌చ్చాయి. దాంతో ఇప్పుడు భ‌ర‌త్ అనే నేనుపై కూడా అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం కూడా క‌చ్చితంగా ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాయ‌డం ఖాయం అంటున్నారు అభిమానులు. మ‌హేశ్ అయితే ఈ చిత్రం త‌న కెరీర్ లో ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌ని చెబుతున్నాడు. ట్రైల‌ర్ లో మ‌హేశ్ బాబును ఓ వైపు సిఎంగా డిగ్నిఫైడ్ గా క‌నిపిస్తూనే.. మ‌రోవైపు మాస్ ప్రేక్ష‌కులు కోరుకునే అంశాల్ని కూడా పొందు ప‌రిచాడు కొర‌టాల శివ‌. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోవ‌డం ఖాయం. అంద‌ర్నీ మాట మీద నిల‌బ‌డే మ‌గాళ్ల‌ను చేస్తాన‌ని చెప్ప‌డం.. ఆ త‌ర్వాత వ‌చ్చే ఫైట్ సీన్.. ఇవ‌న్నీ అదిరిపోయాయి. ట్రైల‌ర్ కు హైలైట్ గా నిలిచిన షాట్స్ ఇవే. అక్క‌డ‌క్క‌డా శ్రీ‌మంతుడు ఛాయ‌లు క‌నిపించాయి. ఎంతైనా అదే ద‌ర్శ‌కుడు క‌దా.. కాస్త క‌నిపించ‌డం మామూలే. ప‌ల్లెటూళ్లే దేశానికి ప‌ట్టుకొమ్మ‌లు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెర‌కెక్కించాడు కొర‌టాల శివ‌. మ‌రి చూడాలిక‌.. ఎప్రిల్ 20న రానున్న భ‌ర‌త్ జ‌ర్నీ ఎలా ఉండ‌బోతుందో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌.

More Related Stories