English   

రంగ‌స్థ‌లం 3.5.. భ‌ర‌త్ అనే నేను 3..

mahesh-charan
2018-04-26 10:40:27

తెలుగు సినిమాకు ఇప్పుడు గోల్డెన్ టైమ్ న‌డుస్తుంది. ఇన్నాళ్లూ ఓవ‌ర్సీస్ లో ఒక్క 3 మిలియ‌న్ సినిమా వ‌స్తే బాగున్ను అని క‌ళ్లు కాయ‌లు కాచేలా వేచి చూసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. బాహుబ‌లి కాకుండా ఆ రికార్డ్ మ‌రే సినిమా అందుకోలేదు. కానీ ఇప్పుడు ఒక్క నెల గ్యాప్ లోనే రెండు భారీ సినిమాలు అంచ‌నాలు అందుకోవ‌డం.. వ‌సూళ్ల వ‌ర‌ద పారించ‌డంతో తెలుగు ఇండ‌స్ట్రీ సంతోషంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ లో మ‌న సినిమాల దెబ్బ‌కు ఇప్పుడు బాలీవుడ్ కూడా సైలెంట్ అయిపోతుంది. కావాలంటే చూడండి.. మొన్న‌టికి మొన్న రంగ‌స్థ‌లం 3 మిలియ‌న్ క్రాస్ చేసి.. ఇప్పుడు 3.5 మిలియ‌న్ వైపు అడుగేస్తుంది. ఈ వారంలోనే ఆ రికార్డ్ అందుకోవ‌డం ఖాయం. ఇక రంగ‌స్థ‌లంతో పాటే భారీ అంచ‌నాల‌తో ఈ మ‌ధ్యే విడుద‌లైన భ‌ర‌త్ అనే నేను కూడా వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. ఈ చిత్రం కూడా ఓవ‌ర్సీస్ లో దుమ్ము దులిపేస్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం 2.7 మిలియ‌న్ దాటేసింది. నేడో రేపో 3 మిలియ‌న్ క్రాస్ చేయ‌డం ఖాయం. ఇదే జ‌రిగితే తెలుగు ఇండ‌స్ట్రీ రేంజ్ బాలీవుడ్ కు చేరుకున్న‌ట్లే. మ‌రో వారం రోజుల పాటు ఏ సినిమాలు లేక‌పోవ‌డంతో క‌చ్చితంగా ఈ చిత్రం మ‌రో 1.5 మిలియ‌న్ పైనే సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నారు అక్క‌డి డిస్ట్రిబ్యూట‌ర్లు. మొత్తానికి మ‌న సినిమాలు స‌రిగ్గా వ‌ర్క‌వుట్ అయితే టాలీవుడ్ రేంజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు అంద‌రికీ ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది.
 

More Related Stories