English   

మహేష్ బాబు .. వచ్చిండయ్యో సామి.. 

Mahesh-Babu
2018-04-05 10:20:33

సూపర్ స్టార మహేష్ బాబు భరత్ అనేనేనుపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. కాదు.. పెంచుతున్నారు. వరుసగా సర్ ప్రైజెస్ ఇస్తూ దూసుకుపోతోంది టీమ్. ఇప్పటికే ఆంథెమ్, భరత్ విజన్ సాంగ్ తో పాటు టీజర్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సాంగ్ విడుదల చేయబోతున్నారు. గురువారం సాయంత్రం 5గంటలకు విడుదల చేయబోయే ఈ సాంగ్ ‘వచ్చిండయ్యో సామి’ అంటూ సాగుతుంది. ఈ పాటకు సంబంధించిన స్టిల్ లో మహేష్ బాబు సూపర్ గా ఉన్నాడు. పంచెకట్టులో మాస్ బీట్ కు డ్యాన్స్ వేస్తోన్న స్టిల్ ఇది. చూడగానే ఇట్టే ఆకట్టుకుంటోంది.  ఇప్పటి వరకూ వచ్చిన పాటలకు భిన్నంగా ఇది కాస్త మాస్ బీట్ తో సాగు హుషారైన పాటగా చెబుతున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీకి సంగీతం ఓ హైలెట్ గా నిలవబోతోందటున్నారు.  

ఇప్పటికే కొరటాల శివ, మహేష్ బాబు, దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు ఆడియో పరంగానూ సూపర్ హిట్ అయింది. ఇది అంతకు మించి ఉంటుందని చెబుతున్నారు. డివివి దానయ్య నిర్మిస్తోన్న భరత్ లో బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతోన్న ఈ పొలిటికల్ డ్రామాలో.. నేటి పాలిటిక్స్ పై చాలా సెటైర్స్ ఉంటాయని ముందు నుంచీ చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి రూరల్ డెవలప్ మెంట్ పై దృష్టిపెడతాడట. అది కూడా చైల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ను బాగు చేస్తూ ఇప్పటి వరకూ ఆ వ్యవస్థ నాశనం కావడానికి కారణాలపై ఘాటైన కమెంట్స్ కూడా చేస్తాడని టాక్. మొత్తంగా ఈ సాయంత్రం రాబోతోన్న ఈ పాటతో అభిమానుల్లో మరింత హుషారు నింపబోతున్నాడీ భరత్.. 
 

More Related Stories