English   

యాక్టివ్ పొలిటీషియ‌న్ గా మ‌హేష్ బాబు

mahesh-Ban
2018-03-04 15:11:21

మ‌హేష్ బాబు ఏం చేసినా కొంత హానెస్టీ క‌నిపిస్తుంది. అందుకే అత‌ని ఫ్లాప్ సినిమాలు ఇత‌ర హీరోల సినిమాల్లా పెద్ద‌గా ట్రాల్ అవ్వ‌వు. మొత్తంగా రెండు భారీ డిజాస్ట‌ర్స్ మ‌ధ్య‌లో ఒక హిట్ కొట్టిన మ‌హేష్ బాబు ఇప్పుడు ఖచ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల్సిన ప‌రిస్థితుల్లో ఉన్నాడు. అందుకే త‌న కెరీర్ లోనే బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ హిట్ ఇచ్చిన కొర‌టాల శివ‌తో టై అప్ అయ్యాడు. 

భ‌ర‌త్ అనే నేను అనే టైటిల్ తో వస్తోన్న ఈ మూవీలో మ‌హేష్ బాబు సాధార‌ణ మెకానిక్ గా క‌నిపిస్తాడు. అలాంటి వ్య‌క్తి పాలిటిక్స్ లోకి వ‌చ్చి సిఎమ్ అయితే ఎలా ఉంటుంది. అత‌ను ఎలాంటి సంస్క‌ర‌ణ‌లు చేస్తాడు అనే కోణాల్ల సినిమా సాగుతుంద‌ని టాక్.  ఇందుకోసం మ‌హేష్ బాబుతో క‌రెంట్ పాలిటిక్స్ పై నిజంగానే కొన్ని రియ‌ల్ సెటైర్స్ వేయ‌బోతున్నాడ‌ట కొర‌టాల శివ‌. వీటిలో ముఖ్యంగా ఏపికి స్టేట‌స్ తో పాటు సౌత్ స్టేట్స్ పై కేంద్రం చిన్న‌చూపు వంటి విష‌యాల‌పై ఘాటైన వ్యంగ్యాస్త్రాలుంటాయ‌ని టాక్. 

సినిమా మొత్తంగా కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ గానే సాగినా.. అత‌ను సిఎమ్ అయిన త‌ర్వాతే క‌థ మారుతుంద‌ట‌. అప్ప‌టి వ‌ర‌కూ ఎంట‌ర్టైనింగ్ అనిపించిన క‌థ సీరియ‌స్ మోడ్ లోకి మారుతుందని చెబుతున్నారు. అయితే మ‌హేష్ సిఎమ్ అయ్యాకే సినిమా నెక్ట్స్ లెవెల్ లో సాగుతుందంటున్నారు. మొత్తంగా ఇప్ప‌టి పాలిటిక్స్ పై సెటైర్స్ అయినా క‌మెంట్స్ అయినా చేయాలంటే కాస్త డేర్ ఉండాలి. ఆ రోజుల్లో ఆ డేర్ సూప‌ర్ స్టార్ కృష్ణ ఈనాడు, ప్ర‌జారాజ్యం వంటి సినిమాల్లో చేశారు.. హిట్లు కొట్టారు. ఇప్పుడీ సూప‌ర్ స్టార్ భ‌ర‌త్ గా ఆ ప‌ని చేయ‌బోతున్నాడ‌న్న‌మాట‌..

More Related Stories