English   

భ‌ర‌త్ అది మొద‌లుపెట్టాడు.. 

Mahesh-Bharat-Anu Nenu
2018-03-24 13:54:37

ఈ రోజుల్లో సినిమాకు ప్ర‌మోష‌న్ ఎంత కీల‌క‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌మోష‌న్ లేక‌పోతే ఎంత పెద్ద సినిమా అయినా కూడా తుస్ అనిపిస్తుంది. అందుకే హీరోలు కూడా ఇప్పుడు మారిపోతున్నారు. ప్ర‌మోష‌న్ కోస‌మే ప్ర‌త్యేకంగా స‌మ‌యం కేటాయిస్తున్నారు. ఈ లిస్ట్ లో మ‌హేశ్ కూడా ఇప్పుడు చేరిపోయాడు. ఈయ‌న న‌టిస్తోన్న భ‌ర‌త్ అనే నేను షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఒక్క పాట మిన‌హా అంతా పూర్తైపోయింది. మార్చ్ 25 నుంచి ఆ పాట‌ను స్పెయిన్ లో చిత్రీక‌రించ‌నున్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల‌. హ్యాట్రిక్ విజ‌యాల‌తో జోరు మీదున్న కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు కావ‌డంతో భ‌ర‌త్ అనే నేను బిజినెస్ కూడా భారీ స్థాయిలో జ‌రుగుతుంది. ఇప్ప‌టికే 80 కోట్ల మార్క్ అందుకుంది ఈ చిత్రం. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ చేయాలనే క‌సితో క‌నిపిస్తున్నాడు మ‌హేశ్. అందుకే త‌న సినిమాల్లో దేనికి ఇవ్వ‌నంత టైమ్ దీనికి ప్ర‌మోష‌న్ కోసం ఇస్తున్నాడు మ‌హేశ్ బాబు. ఒక‌టి రెండు రోజులు కాదు ఏకంగా మ‌రో ప‌ని పెట్టుకోకుండా 20 రోజుల పాటు ఈ చిత్రం కోస‌మే ప్రాణం పెట్ట‌నున్నాడు మ‌హేశ్. 

ఎప్రిల్ 20న సినిమా విడుద‌ల కాబ‌ట్టి.. మార్చ్ 25 నుంచే ప్ర‌మోష‌న్ మొద‌లు కానుంది. ఆ రోజు ఈ చిత్రంలోని తొలిపాట‌ విడుద‌ల చేయ‌నున్నారు. భ‌ర‌త్ థీమ్ సాంగ్ ను రిలీజ్ చేయ‌బోతున్నారు. మార్చ్ 25 ఉద‌యం 10 గంట‌ల‌కు విడుద‌ల కానుంది ఈ పాట‌. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు. ఇక ఇప్ప‌ట్నుంచీ కంటిన్యూగా భ‌ర‌త్ ప్ర‌మోష‌న్లు జ‌రుగుతూనే ఉంటాయి. వ‌చ్చే నెల రోజుల పాటు ఇండ‌స్ట్రీని హోరెత్తించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అంచ‌నాలు భారీగా ఉన్నాయి కాబ‌ట్టి దాన్ని ప్రేక్ష‌కుల‌కు చేరువ చేసే బాధ్య‌త కూడా త‌నే తీసుకుంటున్నాడు. పైగా ఈ చిత్రం త‌న‌కు అచ్చొచ్చిన ఫాద‌ర్ సెంటిమెంట్ తో వ‌స్తుంది. గ‌తంలో పోకిరి.. దూకుడు.. సీత‌మ్మ వాకిట్లో.. శ్రీ‌మంతుడు లాంటి సినిమాలు కూడా తండ్రి సెంటిమెంతోనే వ‌చ్చాయి. ఇక ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను కూడా ఇదే కోవలోకి వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాడు మ‌హేశ్. ఇందులో మ‌హేశ్ కు తండ్రిగా శ‌ర‌త్ కుమార్ న‌టిస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. మ‌హేశ్ చేయ‌బోయే ప్ర‌మోష‌న్ ఈ చిత్రాన్ని ఏ రేంజ్ కు తీసుకెళ్ల‌నుందో..?

More Related Stories