English   

భరత్ బహిరంగ సభ మొదలైంది..

Bharat-Bahiranga-Sabha
2018-04-07 18:10:28


సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న భరత్ అనేనేను ప్రీ రిలీజ్ ఈవెంట్/ బహిరంగ సభ మొదలైంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ వేడుక కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. వైవిధ్యమైన స్టేజ్ సెటప్ తో ఇప్పటి వరకూ ఏ సినిమా ఫంక్షన్ కోసమూ చూడని రేంజ్ లో ఏర్పాట్లు ఉన్నాయి. సాయంత్రం మొదలు కానున్న ఈ ఫంక్షన్ కు మధ్యాహ్నం నుంచే అభిమానులు చేరుకోవడం మొదలుపెట్టారు. ఇక సాయంత్ర ఐదుగంటలకే స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయి ఉంది. భరత్ అనే నేనుకు చీఫ్ గెస్ట్ గా వస్తోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కటౌట్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.  అందరూ అనుకున్నట్టుగానే ఈ వేదికపై అసెంబ్లీని తలపించే సెట్స్ వేశారు. అక్కడ ఒక్కొక్కరికి ప్రత్యేకమైన సీటింగ్స్ ఏర్పాటు చేశారు. అచ్చం అసెంబ్లీలో లాగే కనిపిస్తున్నాయీ ఏర్పాట్లు. ఎక్కువ టైమ్ పర్మిషన్ లేదు.. రాత్రి పది గంటల వరకే ఈ ఫంక్షన్ ముగించాలి. అందుకే గెస్ట్ లు కూడా వీలైంనంత త్వరగా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. దేవీ శ్రీ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే అలరిస్తున్నాయి. నిన్న వచ్చిన ఓరయ్యో వచ్చాడయ్యో పాట కూడా సెన్షేషనల్ గా ఉంది. మొత్తంగా మరికాసేపట్లోనే ముఖ్యమంత్రి భరత్ తో పాటు ముఖ్య అతిథులు ఈ బహిరంగ సభకు హాజరుకాబోతున్నారు. 
 

More Related Stories