English   

భ‌ర‌త్ ధైర్యం అంతా సిట్టిబాబే..!

Bharat-Ane-Nenu
2018-04-16 11:02:29

అవును.. ఇప్పుడు భ‌ర‌త్ ధైర్యం అంతా సిట్టిబాబు ఇచ్చిందే. ఈయ‌న గానీ లేక‌పోయుంటే ఈ రోజు భ‌ర‌త్ ఈ స్థాయిలో ఉండేవాడే కాదు. అస‌లు విష‌యం ఏంటంటే భ‌ర‌త్ అనే నేను బిజినెస్ 99 కోట్లు జ‌రిగింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. జ‌స్ట్ సినిమా సేఫ్ అనిపించుకోవాల‌న్నా కూడా 100 కోట్ల షేర్ రాబ‌ట్టాలి. అస‌లే వ‌ర‌స‌గా రెండు ఫ్లాపులు.. దానికితోడు భ‌యంక‌ర‌మైన డిజాస్ట‌ర్లు.. భారీగా వ‌చ్చిన న‌ష్టాలు.. మ‌రోవైపు క‌థ‌ల ఎంపిక‌పై విమ‌ర్శ‌లు.. ఇలా అన్నింటి మ‌ధ్యా ఇరుక్కుపోయాడు మ‌హేశ్ బాబు. ఆయ‌న క‌చ్చితంగా ఇప్పుడు హిట్ కొట్టాల్సిన ప‌రిస్థితుల్లో ఉన్నాడు. భ‌ర‌త్ అనే నేను వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొడితే కానీ ఈయ‌న మార్కెట్ మ‌ళ్లీ పైకి లేవదు. శ్రీ‌మంతుడు కాంబినేష‌న్ కావ‌డంతో బ‌య్య‌ర్లు కూడా భ‌యాలేవీ పెట్టుకోకుండా సినిమాను భారీ రేట్ల‌కు కొనేసారు. పెద్ద సినిమా హిట్టైతే వ‌చ్చే రికార్డులు ఎలా ఉంటాయో ఇప్పుడు రంగ‌స్థ‌లం చూపిస్తుంది. దాంతో మ‌హేశ్ సినిమా కానీ ఆడితే 100 కోట్ల షేర్ ఈజీగా వ‌చ్చేస్తాయి. భ‌ర‌త్ అనే నేను క‌చ్చితంగా ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాయ‌డం ఖాయం అంటున్నారు అభిమానులు. మ‌హేశ్ అయితే ఈ చిత్రం త‌న కెరీర్ లో ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌ని చెబుతున్నాడు. ట్రైల‌ర్ లో మ‌హేశ్ బాబును ఓ వైపు సిఎంగా డిగ్నిఫైడ్ గా క‌నిపిస్తూనే.. మ‌రోవైపు మాస్ ప్రేక్ష‌కులు కోరుకునే అంశాల్ని కూడా పొందు ప‌రిచాడు కొర‌టాల శివ‌. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోవ‌డం ఖాయం. అంద‌ర్నీ మాట మీద నిల‌బ‌డే మ‌గాళ్ల‌ను చేస్తాన‌ని చెప్ప‌డం.. ఆ త‌ర్వాత వ‌చ్చే ఫైట్ సీన్.. ఇవ‌న్నీ అదిరిపోయాయి. ట్రైల‌ర్ కు హైలైట్ గా నిలిచిన షాట్స్ ఇవే. అక్క‌డ‌క్క‌డా శ్రీ‌మంతుడు ఛాయ‌లు క‌నిపించాయి. ఎంతైనా అదే ద‌ర్శ‌కుడు క‌దా.. కాస్త క‌నిపించ‌డం మామూలే. ప‌ల్లెటూళ్లే దేశానికి ప‌ట్టుకొమ్మ‌లు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెర‌కెక్కించాడు కొర‌టాల శివ‌. ఓవ‌ర్సీస్ లో 2000 ప్రీమియ‌ర్స్ ప‌డుతున్నాయి ఈ చిత్రానికి. ఇక ఇక్క‌డ కూడా 2000 థియేట‌ర్స్ లో విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి చూడాలిక‌.. భ‌ర‌త్ అరాచ‌కాలు ఎలా ఉండ‌బోతున్నాయో..?

More Related Stories