English   

సిఎం ల‌వ‌ర్ చాలా హాట్ గురూ

Bharath Ane Nenu Heroine Kiara Advani has done Too Hot Photoshoot
2018-08-08 20:06:01

మొన్న‌టి వ‌ర‌కు కియారా అద్వాని అంటే బాలీవుడ్ కు మాత్ర‌మే సొంతం. కానీ ఇప్పుడు ఇక్క‌డ కూడా ఈ భామ‌కు మంచి ఇమేజ్ వ‌చ్చింది. భ‌ర‌త్ అనే నేనుతో తెలుగులోనూ స్టార్ అయిపోయింది కియారా. పైగా ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమాలోనూ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమాతో పాటే విజ‌య్ సినిమాలోనూ హీరోయిన్ గా కియారాను అనుకుంటున్నారు. అట్లీకుమార్ తెర‌కెక్కించ‌బోయే సినిమాతో త‌మిళ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కానుంది కియారా. ఇక స్టార్ హీరోలే వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు ఇస్తుండ‌టంతో అందాల ఖ‌జానా కూడా తెరిచేసింది ఈ ముద్దుగుమ్మ‌.

ఇప్పుడు ఓ హాట్ ఫోటోషూట్ విడుద‌ల చేసింది కియారా అద్వాని. ఇందులో అమ్మ‌డి సోకులు చూసి షాకులు త‌గులుతున్నాయి. హైద‌రాబాద్ టూ ముంబై చ‌క్క‌ర్లు కొడుతూ ఎప్పుడూ ఎయిర్ పోర్ట్ లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది ఈ భామ‌. ఫోటోషూట్ల‌లోనే కాదు.. బ‌య‌ట కూడా అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కించింది ఈ భామ‌. ముఖ్యంగా న‌డుము అందాలు చూపిస్తూ.. వ‌య్యారాలు పోతుంది కియారా. ఈమె అందాలు చూసి కుర్రాళ్ల‌ క‌ళ్ల‌తో పాటు కెమెరా క‌ళ్లు కూడా పండ‌గ చేసుకున్నాయి. మొత్తానికి రామ్ చ‌ర‌ణ్ సినిమా కూడా హిట్ అయితే కియారా ఇక్క‌డే సెటిల్ అయిపోవ‌డం ఖాయం.

More Related Stories