English   

మీడియాపై క‌న్నేసిన మ‌హేశ్..

Mahesh-Babu
2018-03-05 12:41:56

మ‌హేశ్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ ఎక్క‌డుంటే అక్క‌డే మీడియా క‌న్ను ప‌డుతుంది. అలాంటిది ఆయ‌న ప్ర‌త్యేకంగా మీడియాపై క‌న్నేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈయ‌న సినిమాల నేప‌థ్యం అలా ఉన్నాయి మ‌రి. మ‌హేశ్ ప్ర‌స్తుతం భ‌ర‌త్ అనే నేనులో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇదే నెల‌లో షూటింగ్ పూర్తి చేయ‌బోతున్నాడు కొర‌టాల శివ‌. మూడు పాట‌లు.. కొద్దిగా టాకీ మిన‌హా షూటింగ్ అంతా పూర్త‌యింది. అందులో రెండు పాట‌ల‌ను హైద‌రాబాద్ లోనే అన్నపూర్ణ‌లో సెట్ వేసి తీస్తున్నారు. ఇక ఒక్క పాట మాత్రం ఫారెన్ కి వెళ్లబోతున్నారు టీం. ఎప్రిల్ 7న భ‌ర‌త్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌బోతుంది. 20 సినిమా విడుద‌ల కానుంది. కైరా అద్వాని హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మ‌హేశ్ తండ్రిగా శ‌ర‌త్ కుమార్ న‌టిస్తున్నాడు. రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న ఈ చిత్రంలో మీడియా పాత్ర కూడా చాలా ఉంది. తాజాగా మీడియాకు సంబంధించిన స‌న్నివేశాల‌ను ఓ ప్ర‌ముఖ ఛానెల్ లో చిత్రీక‌రించారు. 

ఇక భ‌ర‌త్ అనేనేనుతో పాటు వంశీ పైడిప‌ల్లితో మ‌హేశ్ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఎప్రిల్ నుంచి మొద‌లుకానుంది. ఈ సినిమా పూర్తిగా జ‌ర్న‌లిజం నేఫ‌థ్యంలో సాగే క‌థ అని తెలుస్తుంది. వంశీ ఇప్ప‌టికే ఈ క‌థ‌పై ప‌లుమార్లు కూర్చుని మ‌హేశ్ కు న‌చ్చే విధంగా సిద్ధం చేసాడు. వ‌ర‌స ఫ్లాపులు వ‌స్తున్న నేప‌థ్యంలో క‌థ‌ల విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు సూప‌ర్ స్టార్. వంశీ పైడిప‌ల్లి సినిమాలో మీడియా విలువ‌లు ఎలా ఉండ‌బోతున్నాయో చూపించ‌బోతున్నాడు మ‌హేశ్. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్. దిల్ రాజుతో క‌లిసి అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మొత్తానికి ఇటు భ‌ర‌త్.. అటు వంశీ సినిమాల‌తో మ‌హేశ్ మీడియాకు ఫ్రెండ్ అయిపోయాడు. 

More Related Stories