English   

కాసేప‌ట్లో భ‌ర‌త్ అనే నేను విడుద‌ల‌..

bharath ane nenu to be release in amazon

అదేంటి.. భ‌ర‌త్ అనే నేను కాసేప‌ట్లో విడుద‌ల ఏంటి అనుకుంటున్నారా..? ఏం లేదు.. ఇప్పుడు ఏ సినిమా అయినా రెండుసార్లు విడుద‌ల‌వుతుంది. ఒక‌టి థియేట‌ర్స్ లో.. మ‌రోటి అమేజాన్ ప్రైమ్ వీడియోస్ లో. ఇప్ప‌టికే భ‌ర‌త్ థియేట‌ర్ విడుద‌ల అయిపోయింది.. 90 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక ఇప్పుడు అమేజాన్ టైమ్ వ‌చ్చింది. జూన్ 9న ఈ చిత్రం విడుద‌ల కానుంది అందులో. దానికి కార‌ణం కూడా ఉంది.. జూన్ 8కి భ‌ర‌త్ అనే నేను 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎప్రిల్ 20న ఈ చిత్రం విడుద‌లైంది. తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న భ‌ర‌త్.. మంచి వ‌సూళ్ల‌నే సాధించాడు. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ మ‌రీ ఎక్కువ‌గా జ‌ర‌గ‌డంతో అబౌ యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోయింది. అమేజాన్ భారీ రేట్ ఇచ్చి మ‌రీ ఈ చిత్ర హ‌క్కుల్ని ద‌క్కించుకుంది. ఇప్ప‌టికే రంగ‌స్థ‌లం అమేజాన్ లో అద్భుతాలు చేసింది. మ‌రి ఇప్పుడు మ‌హేశ్ దూకుడు ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

More Related Stories