English   

తెలుగోడు విశాల్, తమిళ్ లో కలుపుమొక్క సీనియర్ డైరెక్టర్ సంచలన విమర్శలు

Bharathiraja
2019-06-19 11:35:18

కోలీవుడ్ లో జరగనున్న నడిగర్ సంఘం ఎన్నికలు ప్రత్యక్ష్య ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. విశాల్ మీద ప్రత్యర్ధి వర్గాల వారు ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు భారతీరాజా విశాల్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళ నడిగర్ సంఘ కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నవిశాల్ తెలుగు వాడని వాడిని తరిమికొట్టాలంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు. నిర్మాతల మండలిలో మొలిచిన ఇలాంటి కలుపు మొక్కను ఏరేయాల్సిన బాధ్యత తమిళ నిర్మాతల మీద ఉందని ఆయన పేర్కోన్నారు. నడిగర్ సంఘంలో తెలుగు వాళ్ల పెత్తనమేమిటని ప్రశ్నిస్తూ ఇలాంటి పందికొక్కుల్ని తరిమికొట్టాలని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నడిగర్ సంఘం తమిళ నిర్మాతలదైతే అందులో తెలుగువాళ్ల పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు. అందుకే ఈ ఎన్నికల్లో తన నేతృత్వంలోని టీంను గెలిపించుకోవడం ద్వారా తమిళ నటుల ఉనికిని కాపాడాలని అన్నారు. తాను గెలిస్తే... నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటుల సంఘం) పేరుని తమిళ సినీ నటుల సంఘంగా మారుస్తామని ఆయన ప్రాంతీయ భావనలు రేపి మరీ ప్రచారం చేస్తూన్నారు భారతీ రాజా.

More Related Stories