English   

భీష్మ కలెక్షన్స్.. బాక్సాఫీస్ ను దత్తత తీసుకున్న నితిన్..

nithin
2020-02-25 19:10:39

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన 'భీష్మ' చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజు అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. దానికి తోడు సేంద్రియ వ్యవసాయం చుట్టూ వెంకీ కుడుముల అల్లుకున్న స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. చెప్పాల్సిన విషయాన్ని చెబుతూనే కడుపు చెక్కలయ్యేలా నవ్వించారు వెంకీ. తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు వసూళ్ల విషయంలో కూడా ఇదే దూకుడు చూపిస్తున్నాడు నితిన్. ఈయన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా 'భీష్మ' రికార్డ్ సొంతం చేసుకుంది. నాలుగేళ్ల కిందట త్రివిక్రమ్ తెరకెక్కించిన అ..ఆ సినిమా రికార్డులు కూడా ఇది తిరగరాస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా నైజాంలో అయితే నాలుగు రోజుల్లో 7 కోట్ల షేర్ ని రాబట్టింది. 'అ..ఆ' 2016 లో దాదాపు 48 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు నితిన్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అయితే ఆ సినిమాకి త్రివిక్రమ్ అండగా ఉన్నాడు. ఇప్పుడు తన సొంత ఇమేజ్ తో ఈ సినిమాను నిలబెడుతున్నారు నితిన్. ఇప్పటి వరకు 4 రోజులలోనే భీష్మ ఆంధ్రా తెలంగాణాలలో కలిపి 17 కోట్ల షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది బీష్మ. 19.5 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ చేసిన భీష్మ మరో మూడు కోట్లు వసూలు చేస్తే హిట్ అవుతుంది. మరో రెండు వారాల వరకు పెద్దగా సినిమాలు లేవు కాబట్టి ఖచ్చితంగా నితిన్ బ్లాక్ బస్టర్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

More Related Stories