చూపులతోనే చంపేస్తుంది బాబోయ్..!

మేకోవర్ అనే మాటకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది భూమి ఫడ్నేకర్. దమ్ లగాకే ఐసా అనే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది భూమి. అప్పుడు ఈమె బరువు 100 కేజీల పైనే. ఆ కారెక్టర్ కు తగ్గట్లు ఆంటీలా మారిపోయింది భూమి. ఆ తర్వాత కష్టపడి తగ్గింది. ఈ మధ్యే అక్షయ్ కుమార్ టాయ్ లెట్ సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో భూమి ఇమేజ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు అమ్మాయిగారు పిచ్చ గ్లామరస్ గా మారిపోయారు. ఈమె తొలి సినిమా చూసినవాళ్లకు అసలు ఈ అమ్మాయిలో ఇంత మార్పేంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు. బరువు తగ్గడమే కాదు.. సూపర్ హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది భూమి పడ్నేకర్. ఈ మధ్యే తన తొలి చిత్ర హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన శుభ్ మంగళ్ సావధాన్ కూడా సూపర్ హిట్ అయింది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు హాట్ ఫోటోషూట్లతో మతులు పోగొడుతుంది భూమి. ఇక ఇప్పడు విడుదలైన ఫోటోషూట్ కూడా పిచ్చెక్కించేసింది. కసి చూపులతో మతులు పోగొట్టింది భూమి. ఈమె పోజులకు నిద్రలు చెడిపోతున్నాయి. ఈ మధ్యే లస్ట్ స్టోరీస్ లో కూడా న్యూడ్ గా నటించి రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ.