English   

ఆహా పిల్ల ఏం మారిపోయిందిరా..!

Bhumi-pednekar

మ‌నం 10 కేజీల బరువు త‌గ్గితేనే చూస్కోరా.. నేను 10 కేజీలు త‌గ్గాను అని గొప్ప‌లు చెప్పుకుంటారు. కానీ ఏకంగా 40 కిలోలు త‌గ్గితే దాన్నేం అంటారు. బాలీవుడ్ భూమి ఫ‌డ్నేక‌ర్ ఇదే చేసింది. ద‌మ్ ల‌గాకే ఐసా అనే సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది భూమి. అప్పుడు ఈమె బ‌రువు 100 కేజీల పైనే. ఆ కారెక్ట‌ర్ కు త‌గ్గ‌ట్లు ఆంటీలా మారిపోయింది భూమి. ఆ త‌ర్వాత క‌ష్ట‌ప‌డి త‌గ్గింది. ఈ మ‌ధ్యే అక్ష‌య్ కుమార్ టాయ్ లెట్ సినిమాలో న‌టించింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో భూమి ఇమేజ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు అమ్మాయిగారు పిచ్చ గ్లామ‌రస్ గా మారిపోయారు. ఈమె తొలి సినిమా చూసిన‌వాళ్ల‌కు అస‌లు ఈ అమ్మాయిలో ఇంత మార్పేంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు. బ‌రువు త‌గ్గ‌డమే కాదు.. సూప‌ర్ హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది భూమి ప‌డ్నేక‌ర్. ఈ మ‌ధ్యే త‌న తొలి చిత్ర హీరో ఆయుష్మాన్ ఖురానాతో క‌లిసి న‌టించిన శుభ్ మంగ‌ళ్ సావ‌ధాన్ కూడా సూప‌ర్ హిట్ అయింది. ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు పోగొడుతుంది భూమి. తాజాగా ఓ ఫోటోషూట్ లో అమ్మాయిగారు చేసిన ర‌చ్చ‌కు కుర్రాళ్ళ నిద్రలు చెడిపోతున్నాయి.  

More Related Stories