English   

కొడుకుతో ఖుషీగా

Bhumika-Chawla

ఖుషీతో తెలుగు ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకున్న బ్యూటీ భూమిక‌. గండుచీమ కుట్టిన‌పెదాల‌తో అప్ప‌ట్లో కుర్రాళ్ల‌కు కునుకు లేకుండా చేసిన ఈ బ్యూటీ త‌ర్వాత తెలుగుతో పాటు సౌత్ లోని స్టార్ హీరోలంద‌రితోనూ న‌టించింది. త‌ర్వాత యోగా టీచ‌ర్ భ‌ర‌త్ టాకూర్ పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూర‌మైంది. ఈ మ‌ధ్య‌లో ఒక సినిమా నిర్మించి లాస్ అయింది. ఓ సినిమా ప‌త్రిక‌నూ న‌డిపించే ప్ర‌య‌త్నం చేసి ఫెయిల్ అయింది. ఈ నేప‌థ్యంలో కుటుంబ‌లో ఆర్థిక‌పర‌మైన చిక్కులు మొద‌ల‌య్యాయి. అవి భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వల‌కు కార‌ణ‌మ‌య్యాయి అంటారు. ప్ర‌స్తుతం భూమిక భ‌ర్త‌కు దూరంగా ఉంటోంది. అలాగే మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టింది. ఆ మ‌ధ్య చేసిన ఎమ్.సి.ఏలోని ఒదిన పాత్రకు మంచి పేరొచ్చింది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తోన్న స‌వ్య‌సాచిలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే స‌మంత నిర్మిస్తోన్న యూ ట‌ర్న్ లోనూ సినిమాను ట‌ర్న్ తిప్పే పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.లేటెస్ట్ గా త‌న కొడుకుతో క‌లిసి ఇదుగో ఇలా ఓ క్యూట్ ఫోజిచ్చింది. బాబు కూడా చూడ్డానికి భ‌లే ముద్దుగా ఉన్నాడు క‌దూ. త‌న కొడుకుతో క‌లిసి ఈ ఖుషీ మూమెంట్ ను సోష‌ల్ మీడియాతో షేర్ చేసుకుందీ ఖుషీ బ్యూటీ.

 

More Related Stories