English   

బిగ్ బాస్ షో పై భూమిక కామెంట్స్ 

Bigg Boss
2021-06-07 10:08:52

బిగ్ బాస్ షో ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ నడుస్తోంది. కన్నడ, మళయాలం, తెలుగు, తమిళం, బెంగాలీ ఇలా ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ షో ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. అయితే ఈ షో గురించి, ఆమెకు వస్తోన్న ఆఫర్ల గురించి భూమిక తాజాగా నోరు విప్పారు. తనకు ఆఫర్లు వచ్చిన మాట నిజమే గానీ వాటిని ఇంత వరకు అంగీకరించలేదు.. ఎప్పుడూ అంగీకరించను కూడా అని తెగేసి చెప్పేశారు. నిత్యం కెమెరాలు తన మీదే ఫోకస్ పెట్టి ఉండటం తనకు నచ్చదని భూమిక చెప్పుకొచ్చారు. మొత్తానికి బిగ్ బాస్ రూమర్లపై భూమిక కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పేశారు. తెలుగులో ఇప్పటికి నాలుగు సీజన్లు పూర్తయ్యాయి. ఐదో సీజన్ ఇప్పటికే ప్రారంభం కావాల్సింది కానీ సెకండ్ వేవ్ దెబ్బకు ఆలస్యం అవుతోంది. అయితే ఇంకా సెట్ పనులే ప్రారంభించలేదు గానీ కొన్ని వెబ్ సైట్స్ మాత్రం బిగ్ బాస్ షో గురించి కథనాలు రాసేస్తున్నాయి.
 

More Related Stories