English   

చైతూ అక్క సమంతకు దెయ్యంలా మారింది

Bhumika-Samantha

టైటిల్ చూసి.. ఈ ఇద్దరికీ లింక్ ఎక్కడ కలిసింది. సమంత కోసం అనలేం కానీ సమంత వల్ల దెయ్యంలా మారుతోంది భూమిక. ఒకప్పుడు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన భూమిక దెయ్యంలా మారడం అంటే ఆశ్చర్యమే. కానీ ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే. ఇంతకీ భూమిక దెయ్యం కథేంటంటే.. అప్పుడెప్పుడో కన్నడలో వచ్చిన హిట్ మూవీ యూ టర్న్. ఈ మూవీపై సమంత అప్పుడే మనసు పారేసుకుంది. ఈ  సనిమా అంటే శామ్ కు చాలా ఇష్టం. అందుకే తెలుగులో రీమేక్ చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. నిర్మాత కూడా తనే. కన్నడలో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పవన్ కుమారే ఈ తెలుగు వెర్షన్ కూ దర్శకుడు. 

ఇప్పటికే తెలుగు వెర్షన్ కు తగ్గట్టుగా చాలా మార్పులు చేశారట. ఇందులో ఓ కీలక పాత్రలోనే భూమిక నటించబోతోంది.  అయితే భూమిక దెయ్యంలా నటిస్తోందంటున్నారు. పాత్ర నిడివి పరంగా చాలా తక్కువే అయినా సినిమాలో ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ చాలా పెద్దదంటున్నారు. అందుకే భూమిక కూడా ఒప్పుకుందంటున్నారు. మరి ఈ ఇద్దరికీ ఎక్కడ సెట్ అయిందో తెలుసా.. నాగ చైతన్య కొత్త సినిమా సెట్ లో. యస్ చైతూ కొత్త సినిమా సవ్యసాచిలో అతనికి అక్కగా నటిస్తోంది భూమిక. అక్కడే శామ్ ఈ పాత్ర గురించి తనకు చెప్పింది. పాత్ర చిన్నదైనా నచ్చడంతో భూమిక కూడా ఓకే చెప్పేసింది. ఒక రకంగా ఇది తనకూ చేంజ్ ఓవర్ లాంటి పాత్ర. లేదంటే ఇలాగే ఒదిన, అక్క పాత్రలకే పరిమితమవుతుంది. ఇక ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి నటిస్తున్నారు. వీళ్ల పాత్రలతో పాటు సమంత క్యారెక్టర్ అలాగే.. సినిమాకు సంబంధించిన పూర్తి అప్డట్స్ ను త్వరలోనే ప్రకటించబోతోంది యూ టర్న్ టీమ్. 

More Related Stories