English   

బిగ్ బాస్ 2 ఎన్టీఆర్ కాదు.. మ‌రెవ‌రో..?

nagarjuna and ntr

నిన్న‌టి వ‌ర‌కు బిగ్ బాస్ 2పై ఎవ‌రికీ అనుమానాల్లేవు. కానీ ఇప్పుడు మొద‌ల‌య్యాయి. ఎందుకంటే ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజ‌న్ 2 నుంచి త‌ప్పుకున్నాడు. ఆయ‌న కెరీర్ లో బిజీగా ఉండ‌టంతో బిగ్ బాస్ 2 నుంచి త‌ప్పుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఓ వైపు త్రివిక్ర‌మ్ సినిమాతో పాటు రాజ‌మౌళి కూడా ఎన్టీఆర్ కోసం క్యూ లో ఉన్నాడు. దాంతో ఈయ‌నకు మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. అందుకే బిగ్ బాస్ కు బైబై చెప్పేసాడు. అక్టోబ‌ర్ నుంచే రాజ‌మౌళి సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. దాంతో ఇప్పుడు మ‌రో హీరో కోసం వెతుక్కుంటున్నారు మాటీవీ యాజ‌మాన్యం. అస‌లు తెలుగులో బిగ్ బాస్ లాంటి షో హిట్ అవుతుంద‌నే ఎవ‌రూ అనుకోలేదు. కానీ కేవ‌లం ఎన్టీఆర్ స్టార్ డ‌మ్ తో ఈ షో సూప‌ర్ పాపుల‌ర్ అయింది. ఊహించ‌ని రేటింగ్స్ తో సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం చూడని ఎన్టీఆర్ ను బిగ్ బాస్ లో మ‌న‌కు చూపించాడు యంగ్ టైగ‌ర్. తాను ఇలాగే ఉంటానంటూ కొత్త ఎన్టీఆర్ ను మ‌న‌కు పరిచ‌యం చేసాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ తొలి సీజ‌న్ అయిపోయింది. దాంతో అంద‌రి దృష్టి రెండో సీజ‌న్ పై ప‌డింది. ఆ సీజ‌న్ కు హోస్ట్ ఎవ‌రు..? 

ఎన్టీఆర్ కాకుండా మ‌రో హోస్ట్ వ‌స్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారా..? ఎన్టీఆర్ కాకుండా అంత స‌క్సెస్ ఫుల్ గా హోస్టింగ్ చేసే హీరో మ‌రెవ‌రు ఉన్నారు ఇండ‌స్ట్రీలో..? ఇప్పుడు ఇలా ప్రేక్ష‌కుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దీనిపై స‌మాధానం ఇప్ప‌ట్లో రావ‌డం క‌ష్ట‌మే కానీ.. బిగ్ బాస్ రెండో సీజ‌న్ కోసం నాని పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఏడాదికి నాలుగు సినిమాలు చేసే నాని.. అది వదిలేసి బిగ్ బాస్ వైపు వ‌స్తాడా అనేది అనుమాన‌మే. ఇక అఖిల్ పేరు వినిపించినా.. అత‌డు హ్యాండిల్ చేయ‌గ‌ల‌డా అనేది పెద్ద ప్ర‌శ్న‌. అత‌డి కంటే తండ్రి నాగార్జున‌ను న‌మ్ముకుంటే ఇంకా మంచిదేమో..? పైగా మా టీవీతో ఆయ‌న‌కున్న అనుబంధం అలాంటిది.. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు రెండు సీజ‌న్ల పాటు స‌క్సెస్ ఫుల్ గా న‌డిపించాడు నాగ్. ఇలా చాలా వ‌ర‌కు నాగార్జున బెటర్ ఆప్ష‌న్ గా క‌నిపిస్తున్నాడు. కానీ జ‌నం ఎన్టీఆర్ కు అలవాటు ప‌డిన త‌ర్వాత అత‌న్ని మ‌రిపించే స్థాయిలో మ‌రో హోస్ట్ ను తీసుకురావాలంటే మాత్రం క‌ష్ట‌మే. అలా చేస్తే చిరంజీవి మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడులా అయితే అస‌లుకే మోసం వ‌స్తుంది..! చూడాలిక‌.. ఏం చేస్తారో.. బిగ్ బాస్ 2 ఎవ‌రు అవుతారో..?

More Related Stories