English   

Big Boss 5:  హౌలో ర‌చ్చ మామూలుగా లేదు.. ఫ‌స్ట్ ఎలిమినేష‌న్ కాబోయేదెవ‌రో మ‌రీ! 

bigg boss season 5 telugu
2021-09-11 14:39:08

బుల్లితెరపై బిగ్ బాస్ 5 సీజ‌న్ సందడి ప్రారంభ‌మైంది. గ‌డిచిన నాలుగు సీజన్ కంటే ఈ సీజ‌న్ భిన్నంగా  షూరయ్యింది. ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. దాదాపు అంద‌రూ  పరిచయమున్న సెలబ్రిటీలే .. అలాగే కొత్త‌వారి కోసం నెటిజ‌న్లు తెగ వెతుకున్నారు. ఇదిలాఉంటే.. తొలి రోజు నుండే కంటెస్టెంట్ల మ‌ధ్య మాట‌ల యుద్దం ప్రారంభ‌మైంది. కంటెస్టెంట్ లు తమ పరిచయాన్ని పూర్తిగా పెంచుకోక ముందుకే గొడవల‌కు దిగుతున్నారు. 

ఈ  స‌మ‌యంలో బిగ్ బాస్ పెట్టిన గొడ‌వ మామూలుగా లేదు..  ఎవ‌రు బెస్ట్‌.. ఎవ‌రు వ‌ర‌స్ట్ ఫ‌ర్పామ‌రో చెప్పాల‌నే ఆదేశంతో కంటెస్టెంట్ల మ‌ధ్య మ‌రోసారి చిచ్చు రాచుకుంది. ఇలా విభేదాలతో ర‌స‌వ‌త‌రంగా సాగుతున్న ఈ సీజ‌న్లో చూస్తుండ‌గానే  వారం రోజులు గ‌డిపోయాయి.  

ఇదిలా ఉంటే.. మ‌రోవైపు కంటెస్టెంట్ల మ‌ధ్య‌ ఎలిమినేషన్ భ‌యం ప‌ట్టుకుంది. మొదటి ఎలిమినేషన్ రౌండ్ లో ఆరుగురు కంటెస్టెంట్ ల పేర్లు నామినేట్ లిస్టులో చేరాయి. ఈ లిస్ట్ లో యాంకర్ రవి, ఆర్జే కాజల్, హమీద, జశ్వంత్ (జెస్సీ), మానస్, సరయు ఉన్నారు. దీంతో ఈ లిస్ట్‌లో ఉన్న పేర్లు బాగా వైర‌ల్ అవుతున్నాయి. 

మ‌రోవైపు ఈ వారం మోడల్ జశ్వంత్ ఎలిమినేష‌న్ కాబోతున్న‌డ‌ని వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి.  జ‌శ్వంత్ ఫ‌స్ట్ నుంచే చాలా సైలెంట్ గా కనిపిస్తూ.. చాలా అమాయకుడని ముద్ర పడిందని ప్రేక్ష‌కుల మ‌దిలో ముద్ర వేసుకున్నాడు. కానీ ఇటివ‌ల అనీ మాస్టర్  విష‌యంలో ఓ రేంజ్ రియాక్టయ్యాడు. దీంతో ఆయ‌న మీద ఉన్న సాప్ట్ ఫీలింగ్, అమాయ‌కుడు అనే ఫీలింగ్ కొంత వ‌ర‌కు పోయింది. కానీ ఆయ‌న చేసిన‌ ప‌నితో ఆయ‌న‌కు రావాల్సిన ఓట్లు కూడా త‌గ్గిన‌ట్టు తెలుస్తుంది.  

ఇదే స‌మ‌యంలో సోషల్ మీడియాలో కూడా జెస్సీపై ట్రోలింగ్స్, కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మొదటి ఎలిమినేషన్ రౌండ్ లో జశ్వంత్ బిగ్ బాస్ హౌ నుంచి బ‌య‌ట‌కు రానున్న‌ట్టు తెలుస్తుంది. కానీ ఏది వాస్త‌వమో.. ఏది అవాస్త‌వ‌మో ఈ వారం చివ‌రి వ‌ర‌కు వేచి చూడాలి.

More Related Stories