English   

Big Boss 5: రచ్చో రచ్చస్య.. మాట జారిన జ‌బర్ద‌స్త్ ఫేం.. కాలు మొక్క‌బోయిన కూల్ కానీ ఉమ!

bigg boss telugu
2021-09-11 15:30:11

బిస్ బాస్ 5  హౌలో ర‌చ్చ మామూలుగా లేదు.. బిగ్ బాస్ ఇచ్చే ట్కాస్‌తో హౌస్ హిటెక్కుతుంది. నెమ్మ‌దిగా హౌస్ సభ్యుల మధ్య పెద్ద ముసలం పుట్టినట్లు కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన షోలో బిగ్ బాస్ ఆదేశాల మేర‌కు ప్ర‌తి కంటెస్టెంట్ ఒక బెస్ట్ కంటెస్టెంట్‌ పేరు, ఒక వ‌ర‌స్ట్ కంటెస్టెంట్ పేరు చెప్పాలి. ఈ టాస్క్ లో  భాగంగా ముందుగా యాంకర్ ర‌వి త‌న అభిప్రాయాన్ని చెప్పుతూ.. లోబో బెస్ట్‌ పర్ఫామర్‌ అని   జెస్సీ వరస్ట్‌ పర్ఫామర్‌ అని పేర్కొన్నాడు.

అలాగే లోబో త‌న అభిప్రాయాన్ని చెప్పుతూ.. యానీ మాస్టర్‌ బెస్ట్‌ అని.. జెస్సీ వరస్ట్‌ అని తెలిపాడు. త‌రువాత‌ శ్వేత వర్మ త‌న డిసిష‌న్ చెప్పుతూ .. విశ్వ బెస్ట్ పర్ఫామర్‌  , ఉమాదేవి వరస్ట్ పర్ఫామర్‌  అని చెప్పింది.  నటరాజ్‌ మాస్టర్‌ బెస్ట్ , ఉమాదేవి వరస్ట్‌ అని సిరి త‌న ఓపినియ‌న్ ను చెప్పింది. విశ్వ త‌న ప్ర‌కారం.. ప్రియాంక సింగ్‌ బెస్ట్‌ అని.. కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్  అని చెప్పుకొచ్చారు. లహరి.. విశ్వ బెస్ట్‌ అని, కాజల్‌ వరస్ట్‌ అని చెప్పుకొచ్చింది.

ఈ క్ర‌మంలోనే ప్రియాంక సింగ్ ( పింకీ) త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించింది. లోబో బెస్ట్ ప‌ర్ఫామ‌ర్ అని,  ఉమాదేవి వరస్ట్‌ అని అభిప్రాయపడింది. ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. ప్రియాంక అభిప్రాయంతో ఉమాదేవి ఏకీభ‌వించ‌లేక‌పోయింది. ఈ తరుణంలో వారివురి మ‌ధ్య మాట మాట పెరిగింది. అలా అలా మాటలు పెరిగి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జ‌రిగింది. ఈ త‌రుణంలో నీతో మాట్లాడటమే వేస్ట్‌ అనేసింది ఉమ‌.

దీంతో ఆవేశానికి లోనైన ప్రియాంక .. ఉమా వైపు వేలు చూపిస్తూ.. ష‌ట‌ప్ అనేసింది. దీంతో ఉమా ఏయ్ అంటూ మీదకి వెళ్ళింది. ఆ గొడ‌వ‌ను అప‌డానికి లోబో, రవి ఇతర కంటెస్టెంట్‌లు ట్రై చేసినా కూల్ కాలేదు. కొద్ది సేపు త‌రువాత ప్రియాంకా రియాలైజ్ అయ్యి ఆవేశంలో షటప్ అనేశానని చెప్పింది. ఉమ కాళ్ల‌ను మొక్క‌డానికి కూడా ప్రియాంక ముందుకు వ‌చ్చింది. కానీ ఉమా మాత్రం కూల్ కాలేదు. పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టుగా స‌ర‌యు ఉమాకు వంత పాడింది. ఇలా ఐదో రోజు షో వాడీవేడిగా సాగింది. 

More Related Stories