English   

మ‌హాన‌టి మామూలు సేఫ్ కాదు..

Mahanati
2018-02-27 21:17:29

సావిత్రి జీవితం అంటే కొంద‌రి సొత్తు కాదు.. అది అంద‌రు తెలుగు వాళ్ల హ‌క్కు. ఈమె జీవితం తెరిచిన పుస్త‌కం. ఇప్పుడు ఆ తెరిచిన పుస్త‌కానికి తెర రూపం ఇస్తున్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఈ తెర‌రూపాన్ని క‌నులారా చూడాలని కోరుకోని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండడేమో అంత అతిశ‌యోక్తి కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడికి రాని ఆలోచ‌న నాగ్ అశ్విన్ కు వ‌చ్చింది. వ‌చ్చిందే త‌డువుగా సావిత్రి జీవితంపై మ‌హాన‌టి సినిమా మొద‌లు పెట్టాడు. అది కూడా ఏదో ఆషామాషీగా కాదు. పెద్ద పెద్ద స్టార్స్ ను పెట్టుకుని.. ఒకే సినిమా అనుభ‌వం ఉన్న నాగ్ అశ్విన్ చేస్తోన్న మ‌హాయ‌జ్ఞం ఈ మహాన‌టి. ఇప్ప‌టికే విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

మాయాబజార్ సెట్ లోకి సావిత్రి పాత్ర‌ధారి అయిన కీర్తిసురేష్ వ‌చ్చి.. బాక్సు తెర‌వ‌గానే అందులోంచి సావిత్రి స్వ‌రంతో కూడిన కొన్ని డైలాగులు.. పాట‌లు వ‌స్తాయి. త‌ర్వాత కొన్ని క‌థ‌లు చ‌రిత్రే.. వాటికి అంతం ఉండ‌దంటూ రాసుంటుంది. ఇదంతా చూస్తుంటే సినిమా ఎంత విజువ‌ల్ వండ‌ర్ గా ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. ఈ సినిమాలో కీర్తిసురేష్, స‌మంతతో పాటు దుల్క‌ర్ స‌ల్మాన్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మోహ‌న్ బాబు, శాలినిపాండే లాంటి స్టార్స్ కూడా న‌టిస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ కూడా ఇప్పుడు అంద‌రికీ షాక్ ఇస్తుంది.

బ‌డ్జెట్ అంతా 22 కోట్లు అయితే శాటిలైట్ రైట్స్ రూపంలోనే అంత మొత్తం వ‌చ్చేసింది నిర్మాత అశ్వినీద‌త్ కు. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లోనూ ఈ సినిమా విడుద‌ల కానుంది. సావిత్రి అంద‌రి సొత్తు కాబ‌ట్టి అన్ని చోట్లా సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంది. మార్చ్ లోనే సినిమా వ‌స్తుంద‌ని చెప్పినా.. ఇప్పుడు ఆ తేదీ మారిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి పెట్టిన బ‌డ్జెట్ అంతా కేవ‌లం శాటిలైట్ రూపంలోనే రావ‌డంతో నిర్మాత అశ్వినీద‌త్ పండ‌గ చేసుకుంటున్నాడు ఇప్పుడు. మ‌రి రేపు విడుద‌లైన త‌ర్వాత మ‌హాన‌టి ఎంత‌మందిని ఏడిపిస్తుందో చూడాలిక‌..!

More Related Stories