English   

బిగ్ బాస్ 3 లో సునీల్ ? అంత అడిగారా ?

 Bigg Boss 3
2019-06-15 12:18:56

మరికొన్ని రోజుల్లో బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 3’ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తినెలకొంది. హోస్ట్ ఎవరు? కంటెస్టెంట్స్ ఎవరు? ఎప్పటి నుండి ప్రసారం కాబోతుంది? లాంటి విషయాలు నిర్వాహకులు క్లారిటీ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో ఆ షో గురించి రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. తొలి సీజ‌న్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఇక సీజ‌న్ 3 ఎప్పుడు మొద‌ల‌వుతుంది, హోస్ట్ ఎవ‌రు అనే దానిపై కొన్నాళ్ళుగా హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ప్ర‌కారం సీజ‌న్ 3లో కంటెస్టెంట్‌గా కమెడియ‌న్ స్టేజ్ నుండి హీరోగా మారిన సునీల్‌ ని తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు భావించార‌ట‌. అందుకే ఆయన వద్దకు వెళ్లి చర్చలు కూడా జరిపారట. అయితే అలా చర్చించడానికి వెళ్ళిన వారికీ సునీల్ షాక్ ఇచ్చినటు చెబుతున్నారు. ఎందుకంటే ఈ షో లో పాల్గొనే సెలెబ్రిటీలకి వారి పాపులారిటీని బట్టి రెమ్యునరేషన్ ఇస్తుంటారు, కానీ సునీల్ అడిగిన రెమ్యునరేషన్ విన్న బిగ్ బాస్ నిర్వాహకులకి చెమటలు పాట్టాయట. దానికి కారణం రోజుకి 25 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తేనే బిగ్ బాస్‌లో పాల్గొంటానని సునీల్‌ అన్నాడ‌ట‌. ఈ విషయం అయితే సోష‌ల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది ఈ విషయం మీద, కానీ అది ఎంత వ‌ర‌కు నిజం అనేది తెలియాల్సి ఉంది.  

More Related Stories