English   

ఈ సారి బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారంటే.. 

 Bigg Boss 4 Telugu
2020-12-02 16:40:47

బిగ్ బాస్ 4 తెలుగు మొదలై ఇప్పటికే 12 వారాలు గడిచిపోయి 13వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో రేస్ 2 ఫినాలే కూడా మొదలైపోయింది. ఈ క్రమంలోనే ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోనున్నారనే దానిపై చాలా చర్చలే జరుగుతున్నాయి. ఈ సారి అరియానా, సోహైల్ తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే రేస్ 2 ఫినాలే టికెట్ కోసం ఇప్పుడు కొందరు రేస్ లో ఉన్నారు. దానికోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్కు నుంచి అరియానా, అవినాష్, మోనాల్ ఎలిమినేట్ అయిపోయారు. ప్రస్తుతం రేసులో హారిక, అఖిల్, సోహైల్, అభిజీత్ ఉన్నారు. వీళ్లలో ఎవరో ఒకరికి ఫినాలే టికెట్ లభించనుంది. వాళ్లు నామినేషన్స్ నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వాళ్లలో ఎవరు బయటికి వెళ్లిపోనున్నారనే ప్రశ్నకు సమాధానంగా అవినాష్ పేరు బలంగా వినిపిస్తుంది. 

నిజానికి ఈయన గత వారమే ఎలిమినేట్ అయ్యాడు కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కారణంగా బతికిపోయాడు. దాంతో ఈ వారం కూడా ఆయనకే తక్కువగా ఓట్లు పడుతున్నట్లు తెలుస్తుంది. మిగిలిన వాళ్లలో అఖిల్, హారిక, అభిజీత్ స్ట్రాంగ్ గా ఉన్నారు. మోనాల్, అవినాష్ లలో ఒకరు కచ్చితంగా బయటికి వెళ్లిపోయేలా కనిపిస్తున్నారు. అయితే మోనాల్ కు బమయ సపోర్ట్ బాగానే కనిపిస్తుంది. పైగా ఈ అమ్మాయికి ఆమె సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి ఓట్లు పడుతున్నాయని తెలుస్తుంది. అందుకే మోనాల్ ఫైనల్ టాప్ 5 కి వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఎలా చూసుకున్నా కూడా ఈ సారి ఓట్ల పరంగా మాత్రం అవినాష్ కు తక్కువగానే పడుతున్నాయి. పైగా మనోడు బిగ్ బాస్ హౌజ్ లో చేస్తున్న పనులు కూడా ఆడియన్స్ కు కోపం తెప్పిస్తున్నాయి. అందుకే ఈ వారం కచ్చితంగా జబర్దస్త్ కమెడియన్ ను ఇంటికి పంపేయాలని చూస్తున్నారు ఆడియన్స్. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..? 

More Related Stories