English   

బిగ్ బాస్ 4 ఫస్ట్ వీక్ నామినేషన్స్.. గంగవ్వని టార్గెట్ చేశారా..

 Bigg Boss 4 Telugu
2020-09-08 17:40:01

బిగ్ బాస్ 4 ఇలా మొదలైందో లేదో అలా నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. తొలివారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి ఏడుగురు నామినేట్ అయ్యారు. అందులో చాలామంది స్పెషల్ కేటగిరీలో వచ్చిన యూట్యూబ్ స్టార్ గంగవ్వను టార్గెట్ చేయడం గమనార్హం. ఇంట్లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్ గంగవ్వను టార్గెట్ చేసి నామినేట్ చేశారు. నిన్ను నామినేషన్ లోకి పంపించినా కూడా బయట జనాలు ఓట్లేసి గెలిపిస్తారు.. అందుకే నామినేట్ చేస్తున్నాము అవ్వ అంటూ ఇంకా చాలా మంది సభ్యులు చెప్పారు. సోషల్ మీడియాలో ఇప్పటికే గంగవ్వను సపోర్ట్ చేస్తూ ఒక ఆర్మీ కూడా పుట్టుకొచ్చింది. ఇక తొలి వారం అవ్వతో పాటు మరో ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. అఖిల్ సార్థిక్, మెహబూబ్, అభిజిత్, సుజాత, సూర్య కిరణ్, దివి తొలివారం నామినేషన్స్ లో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తే గంగవ్వ ఈజీగా సేవ్ అయిపోతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. తొలివారం నామినేషన్స్ లో ఉన్నవాళ్లలో సుజాతతో పాటు మెహబూబ్ కు బయట కాస్త తక్కువ ఫాలోయింగ్ వుంది. దాంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. మొత్తానికి చూడాలి మరి బిగ్బాస్ నాలుగో సీజన్ లో ఎవరు ముందు బయటికి వస్తారో. 

More Related Stories