English   

బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ కు రికార్డు టిఆర్పి రేటింగ్..

 Bigg Boss 4 Telugu
2020-09-17 18:14:42

బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే నాలుగో సీజన్ కూడా మొదలైంది. అయితే రేటింగ్ పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్ తర్వాత మళ్లీ ఆ స్థాయి రేటింగ్స్ ఇప్పటివరకు రాలేదు. మధ్య మధ్యలో మంచి రేటింగ్స్ వచ్చినా కూడా ఎన్టీఆర్ సీజన్ అందుకున్న రికార్డులు మిగిలిన 2 సీజన్లు చేరుకోలేదు. ఇప్పుడు నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్ రికార్డు టిఆర్పి రేటింగ్ సాధించింది. సెప్టెంబర్ 6న బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది. దానికి సంబంధించిన రేటింగ్స్ ఇప్పుడు విడుదలయ్యాయి. తొలి ఎపిసోడ్లో ఏకంగా 18.6 రేటింగ్ రావడంతో మా టీవీ సంబరాలు చేసుకుంటుంది. 

నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ లేనంత రేటింగ్స్ రావడంతో ఈసారి సీజన్ కచ్చితంగా బ్లాక్బస్టర్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. నాలుగవ సీజన్ లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ లేకపోయినా కూడా మంచి మంచి టాస్కులతో ఆసక్తి రేకెత్తిస్తున్నాడు బిగ్ బాస్. కచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ రేటింగ్ వస్తుందని ఆశిస్తున్నారు.18.6 రేటింగ్ అనేది ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు రాలేదు. దాంతో మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తుంది మా టీవీ యాజమాన్యం. పైగా నాగార్జున హోస్టింగ్ కూడా బాగానే హెల్ప్ అవుతుంది. హౌజ్ లో కూడా కొందరు కంటెస్టెంట్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. ఏదేమైనా బిగ్ బాస్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. 

More Related Stories