English   

bigg boss 5 telugu : మా నాన్నను మోసం చేస్తూనే ఉన్నా.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన బిగ్ బాస్ ప్రియాంక!

bigg boss 5 telugu
2021-09-07 11:07:41

bigg boss 5 telugu : బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో మొదలయ్యింది. ఈ బిగ్ బాస్ రియాల్టీ షో ఆదివారం రోజు గ్రాండ్ గా మొదలయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి 19 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇచ్చారు. గత రాత్రి హలో బాబు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. గురక పెట్టి అందర్నీ నిద్రలేపి వేశాడు. యాంకర్ రవి అయితే ఆ గురకను ఆపడానికి విశ్వప్రయత్నాలు చేసిన కూడా లోబో మాత్రం గురక ఆపలేదు.

ఆ తర్వాత  మరుసటి రోజు ఉదయం లేవగానే ఇంటి సభ్యులు అందరూ ప్రణామం ప్రణామం పాటకు చిందులేశారు.ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మనసులోని మాటలను బయట పెట్టి ఎమోషనల్ అయ్యింది. తాను ట్రాన్స్ జెండర్ గా మారిన విషయం ఇప్పటికీ వాళ్ళ నాన్నకు తెలియదని, అలా ప్రియాంక తన నాన్నకి తప్పకుండా మూడేళ్లుగా మోసం చేస్తూ వచ్చానని తెలిపింది.

ఒకసారి గడ్డం మీసం ఏవి రా అని అడిగితే, లేడీ గెటప్ కోసం  అబద్దం చెప్పా అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక అప్పుడు కాజల్ ప్రియాంకను దగ్గరికి తీసుకుని ఓదార్చింది. ఇలా బిగ్ బాస్ వేదిక ద్వారా ట్రాన్స్ జెండర్ గా మారిన విషయాన్ని తన తండ్రికి తెలియజేసింది ప్రియాంక .

More Related Stories