English   

  Bigg Boss 5 Telugu: వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇవ్వనున్న హ‌ట్ యాంక‌ర్‌..  ఇక ర‌చ్చ‌రచ్చే..  

Bigg Boss 5 Telugu
2021-09-11 17:05:42

తెలుగు ప్రేక్షకుల మ‌దిని దోచుకున్న రియాల్టీ షో బిగ్ బాస్ . ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు సీజ‌న్ల విజ‌య‌వంతంగా పూర్తిచేసుకున్న తెలుగు బిగ్ బాస్. గ‌త వారం రోజుల క్రిత‌మే ఐదో సీజ‌న్ ను ప్రారంభమైంది. ఈ షో టీవీ ప్రేక్ష‌కులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ షోకు ముచ్చ‌టగా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఈ సీజ‌న్ భిన్నంగా 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ షో ప్రారంభ‌మై.. కేవ‌లం వారంరోజులైన వాళ్లు చేసే ర‌చ్చ మామూలుగా లేదు.

బిగ్ బాస్ ఇచ్చే ట్కాస్‌ల‌కు వాళ్ల హైడ్రామా పీక్స్‌కు చేరుతుంది. ఇదిలాఉంటే.. కంటెస్టెంట్ల‌లో మ‌రో టెన్ష‌న్ మొద‌లైంది. కేవ‌లం వారంరోజులైన తొలి ఎలిమినేష‌న్ ప్రాసెస్ మొద‌లైంది. ఈ లిస్ట్‌లో ఆరుగురు పేర్లు ఉన్నాయి. అందులో యాంకర్ రవి, ఆర్ జై కాజల్, జశ్వంత్, హమీద, మానస్, సరయు ఉండగా ఇందులో నుంచి బయటికి వెళ్లే కంటెస్టెంట్ లు ఎవరా అని సోషల్ మీడియాలో తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఇదిలాఉంటే .. మ‌రో ఆస‌క్తిక‌ర అంశం వైర‌ల్ అవుతుంది.  బిగ్ బాస్ అన‌వాయితీ ప్రకారం నాలుగో వారంలో వైల్డ్ కార్డు ఏంట్రీ ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం రెండో వారంలోనే వైల్డ్ కార్డు ఏంట్రీ ఉంటుంద‌ని తెలుస్తుంది.  ఎవ‌రా కంటెస్టెంట్ అనే ఆంశం హ‌ట్ టాపిక్‌గా మారింది. ఆ అంశం గురించి తెగ ఆరా తీస్తున్నారు నెటిజ‌న్లు. ఓ పేరు మాత్రం ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. ఆ కంటెస్టెంట్‌ ఎవ‌రిదో కాదు. బుల్లితెర హాట్ యాంకర్ వర్షిణి .

ఈమె వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్లు నెటింట్లో వార్తలు వెలువ‌డుతున్నాయి. యాంకర్ గా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన వర్షిణి.. ఇప్ప‌టికే పలు షో పాల్గొని త‌న అందం చందాల‌తో బాగా సందడి చేస్తుంది.  వ‌ర్షిణి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యుల‌ర్‌గా తన హాట్ హాట్ ఫిక్స్ పెట్టి నెటిజ‌న్ల‌కు పిచ్చెక్కిస్తుంది.   సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ ఈ హ‌ట్ బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే ..   తన అందాలతో మరింత రచ్చ చేస్తుంది.  ఈ షోలో ఎంట్రీ ఇస్తే వ‌ర్షిణి క్రేజ్ మ‌రింత పెరుగుతుందని  గ్యారెంటీ అని చెప్పవచ్చు.

More Related Stories