English   

బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది....ఎవరెవరంటే ?  

Bigg Boss Telugu
2019-07-19 17:46:29

బిగ్ బాస్ మూడో సీజన్ దగ్గరకి వచ్చేసింది, మరో రెండ్రోజుల్లో ఆ షో మొదలయ్యి బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచనుంది. తెలుగులో మూడో సీజన్  కావడం, కింగ్ నాగార్జున తొలిసారి ‘బిగ్ బాస్’ షోను హోస్ట్ చేస్తుండటంతో ఈ మూడో సీజన్‌పై ప్రేక్షకుల్లో ఎనలేని ఆసక్తి పెరిగింది. దీనికి తగ్గట్టుగానే షో నిర్వాహకులు స్టార్ మా ఛానెల్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, కోర్టులు కేసులు దాకా వెళ్ళడంతో ఈ షో మరింత ఆసక్తికరంగా మారింది. మొత్తం 100 రోజులపాటు ఈ షోను నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఇదిలా ఉంటే, హౌజ్‌లోకి అడుగుపెట్టనున్న కంటెస్టెంట్లు వీరేనంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.  

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న సెలబ్రిటీల జాబితా: 
1. నటుడు వరుణ్ సందేశ్ 
2. నటి హేమ 
3. నటి హిమజ 
4. యాంకర్ శ్రీముఖి
5. సీరియల్ నటుడు రవి కృష్ణ
6. సీరియల్ నటుడు అలీ 
7. ‘తీన్‌మార్’ సావిత్రి (యాంకర్ శివ జ్యోతి) 
8. శ్రీరెడ్డి 
9. పునర్నవి భూపాలం
10. మహేష్ విట్ట
11. సీరియల్ నటి రోహిణి  
12. గాయకుడు రాహుల్
13. బాబా భాస్కర్ మాస్టర్ 
14. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ 
15. జర్నలిస్ట్ జాఫర్ 
అయితే 15 మంది సెలబ్రిటీలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు కానీ వారు వీరి పేర్లు ఇంకా ఫైనల్ చేయలేదు. వీరి పేర్లను  21వ తేదీన రివీల్ చేస్తారో లేదంటే షో రేపే ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేస్తారో చూడాలి.  


 

More Related Stories