English   

బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ను బిస్కెట్ చేసారా..

Bigg Boss Telugu
2020-09-26 15:05:57

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్-4 ముందటి సీజన్ ల కంటే ఎక్కువ రేటింగ్ తో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇక గత వీకెండ్ లో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా కంట్రీలోనే తెలుగు బిగ్ బాస్ ఎపిసోడ్ కి ఎక్కువ రేటింగ్ వచ్చిందని స్పష్టం చేశారు. దాంతో హౌస్ మేట్స్ సంబర పడ్డారు. షో కి ఎంతో ఆదరణ లభించిందటూ ఖుషీ అయ్యారు. అయితే సినిమాలు రీలీజ్ అవ్వక ఎంటర్టైన్మెంట్ లేక మాత్రమే బిగ్ బాస్ కి రేటింగ్ ఈ రేంజ్ పెరిందని అర్ధమవుతోంది. ఎందుకంటే గత సీజన్లలో హౌస్ లో అందరూ కొంత ఫేమ్ ఉన్న సెలెబ్రిటీలు రాగా సీజన్ 4 లో మాత్రం టిక్ టాక్ స్టార్లు, యూట్యూబ్ స్టార్ లు వచ్చారు. వారి గురించి చెప్పుకున్నా కూడా టీవీలో ఎప్పుడూ చూళ్లేదే అన్న ప్రశ్న ప్రేక్షకులకు వచ్చింది. ఇక హౌస్ లో నుండి వచ్చిన కరాటే కల్యాణి సైతం బిగ్ బాస్-4 అట్టర్ ప్లాప్ అని తేల్చిచెప్పింది. ఇక షో లో అవినాష్ ఎంట్రీ తరవాత కొంత ఎంటర్టైన్మెంట్ కూడా కనిపిస్తోంది. 

ఇదిలా ఉండగా బిగ్ బాస్ లో కెప్టెన్సీ టాస్క్ కి ఒక ప్రత్యేకత ఉంది. కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం ..కెప్టెన్సీ కోసం హౌస్ మేట్స్ పోటీ పడటం ఎంతో ఆసక్తిగా సాగుతుంది. ఆ టాస్క్ లో జరిగే గొడవలతోనే ప్రేక్షకులకు కొంత వినోదం లభిస్తోంది. అంతే కాకుండా బిగ్ బాస్ కూడా కెప్టెన్సీ టాస్క్ ను చాలా సీరియస్ గా తీసుకుంటారు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ పోటీదారులు ఒక  బౌల్ లో నీళ్లు పట్టుకోవాలని..మిగతా హౌస్ మేట్స్ ఆ బౌల్ లోని నీళ్లను పడేసి తమ మద్దతు ఎవరికో వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పారు. కాగా హౌస్ మేట్స్ అందరూ ఏకాభిప్రాయంతో గంగవ్వ బౌల్ లో తప్ప మిగతా పోటీ దారుల బౌల్స్ లో నీళ్ళని పడేసి గంగవ్వను ఎలాంటి గొడవ లేకుండా ఎన్నుకున్నారు. ఇక ఈ విషయంపై ప్రేక్షకుల్లో కొంత అసంతృప్తి ఏర్పడింది. హౌస్ మేట్స్ త్యాగం కూడా కొంచం ఓవర్ గా అనిపించింది. హౌస్ మేట్స్ టాస్కును వినోదం లేకుండా బిస్కెట్ చేసారని సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. ఇక ఈ విషయం పై బిగ్ బాస్ ఎలా స్పందిస్తారో చూడాలి.

More Related Stories