English   

బిగ్ బాస్ చెత్త షో.. ప‌నిపాట లేనివాళ్లకే..!

Bigg Boss The Worst Show Comedian Pruthvi
2018-08-05 10:54:36

బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించిన ఇలాంటి షోపై మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. దాన్ని విమ‌ర్శించాలంటే కూడా ఆలోచించాలి. ఎందుకంటే స్టార్ హీరోలు కూడా ఈ షోకు హోస్టులుగా ఉన్నారు. స‌ల్మాన్ నుంచి ఎన్టీఆర్, నాని, క‌మ‌ల్ హాస‌న్ లాంటి సూప‌ర్ స్టార్స్ కూడా బిగ్ బాస్ హోస్ట్ గా ఉంటున్నారు. అందుకే ఈ షో గురించి ఎవ‌రూ మాట్లాడరు. కానీ బిగ్ బాస్ పై ఇప్పుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు క‌మెడియ‌న్ పృథ్వీ. ఎప్పుడూ వివాదాల్లో ఉండ‌టం ఈయ‌న ప్ర‌త్యేక‌థ‌. అప్ప‌ట్లో ఖైదీ నెం.150 సినిమాపై కొన్ని కామెంట్స్ చేసి చిరంజీవి దృష్టిలో కూడా ప‌డ్డాడు. ఇకిప్పుడు బిగ్ బాస్  షోను టార్గెట్ చేసాడు పృథ్వీ. ఊళ్ల‌లో పెళ్లిళ్లు జ‌రిగినపుడు కానీ.. పెళ్లికి వ‌చ్చిన వాళ్లు కానీ.. ఓ చోట చేరి ప‌నికిమాలిన ముచ్చ‌ట్లు అన్నీ మాట్లాడుకుంటారు క‌దా.. అలాంటిదే బిగ్ బాస్ అన్నాడు పృధ్వీ.

ఈ షో వ‌ల్ల ఎవ‌డికి ఉపయోగం ఉందో చెప్పండి అంటున్నాడు ఈయ‌న‌. అంతేకాదు.. జనాళ్లను పిచ్చోళ్లని చేయ‌డానికే ఇలాంటి షోస్ చేస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు పృథ్వీ. అదొచ్చి దీన్ని గిల్ల‌డం.. ఈడెళ్లి ఆన్ని గోక‌డం ఇదే బిగ్ బాస్ అంటున్నాడు. పనీ పాటా లేని ఈ షో వల్ల ఎవ‌డికి లాభం ఉంటుంద‌ని బాగానే మండి ప‌డ్డాడు పృథ్వీ. ఒకవేళ తాను బిగ్ బాస్ లో కి వైల్డ్ కార్డ్ ఇస్తే తనకు నిద్ర‌లో లేచే అలవాటుందని.. అందులో ఉన్న ఆడాళ్ల పక్క‌లో పడుకుంటే గోల అవుతుందని సెటైర్ వేసాడు పృథ్వీ. ఈయ‌న మాట‌ల‌పై ఇప్పుడు ర‌చ్చ న‌డుస్తుంది. బిగ్ బాస్ లో కెళ్లి అక్కడున్న వారిని కడిగేస్తానని అన్నారు. మీరంతా అనుకుంటున్న‌ట్లు బిగ్ బాస్ లో అస‌లు మ‌జా తెలియాలంటే త‌న‌తో పాటు పోసానీ.. కేఏ పాల్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాల‌ని కోరుకుంటున్నాడు. మొత్తానికి పృథ్వీ మాట‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తున్నాయి.

More Related Stories