English   

నానికి ఏమైనా హెల్ప్ అవుతుందా..?

Nani-biggboss
2018-07-02 07:54:12

ఒక్క‌సారి బుల్లితెర‌పైకి వ‌చ్చిన త‌ర్వాత వెండితెర‌పై ఇమేజ్ త‌గ్గిపోతుంది అనే భావ‌న ఇన్నాళ్లూ స్టార్ హీరోల్లో ఉండేది. కానీ ఎప్పుడైతే నాగార్జున బుల్లితెర‌పై మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అంటూ ద‌ర్శ‌న‌మిచ్చాడో.. అప్ప‌ట్నుంచే అంద‌రి అంచ‌నాలు తారుమారు అయ్యాయి. ఇప్పుడు ప్ర‌తీ స్టార్ కూడా బుల్లితెర‌పైకి వ‌చ్చేస్తున్నాడు. అలా వ‌చ్చిన త‌ర్వాత వాళ్ల ఇమేజ్ ఇంకా పెరిగి.. హిట్లు కూడా కొట్టారు. కావాలంటే నాగార్జున‌నే తీసుకోండి.. ఈయ‌న ఎంఈకే షో చేయ‌క‌ముందు ఇమేజ్ వేరు.. చేసిన త‌ర్వాత మార్కెట్ వేరు. ఆ మ‌ధ్య వ‌ర‌స విజ‌యాల‌తో జోరు చూపించాడు నాగ్. ఇక చిరు కూడా ప‌దేళ్ల త‌ర్వాత ఖైదీ నెం.150తో వెండితెర‌పై క‌నిపించే ముందే బుల్లితెర‌పై ద‌ర్శ‌న‌మిచ్చాడు. హిట్ కొట్టాడు. ఇక ఎన్టీఆర్ సంగ‌తి చెప్పాల్సిన ప‌నేలేదు. ఈయ‌న అక్క‌డా ఇక్క‌డా కింగే. ఇప్పుడు నాని చేస్తున్నాడు. ఈయ‌న కూడా బిగ్ బాస్ సీజ‌న్ 2కు హోస్ట్ గా చేస్తున్నాడు. అదేం చిత్ర‌మో కానీ ఇన్నాళ్లూ హిట్ల‌లో ఉన్న నాని.. బిగ్ బాస్ కు ముందే కృష్ణార్జున యుద్ధంతో ఫ్లాప్ ఇచ్చాడు. ఇప్పుడు మ‌ళ్లీ హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు. బిగ్ బాస్ 2కు నాని మ్యాగ్జిమమ్ కాప‌లా కాస్తున్నాడు కానీ రేటింగ్స్ విష‌యంలో మాత్రం ఊహించినంత రావ‌డం లేదు. అయితే నానికి మాత్రం ప‌ర్స‌న‌ల్ ఇమేజ్ బాగానే పెరిగిపోతుంది. టీవీల్లో క‌నిపించే స‌రికి ప్ర‌తీ ఇంటి వాడు అయిపోతున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ప‌క్కింటి అబ్బాయి ఇమేజ్ పోయి మ‌న ఇంటి అబ్బాయి అవుతున్నాడు. మ‌రి ఇప్పుడు నాగార్జున‌తో చేస్తోన్న మ‌ల్టీస్టార‌ర్ కు ఈ ఇమేజ్ ఎంత‌వ‌ర‌కు యూజ్ అవుతుందో చూడాలిక‌..!

More Related Stories