English   

బిగ్ బాస్ 2 లో చాలా మంది ఉన్నారే..!

Biggboss list
2018-05-31 10:55:31

బిగ్ బాస్ అంటే ఏడాది కింది వ‌ర‌కు చిరంజీవి అని మాత్ర‌మే తెలుసు తెలుగు ఆడియ‌న్స్ కు. కానీ ఇప్పుడు ముందు ఎన్టీఆర్.. త‌ర్వాత నాని గుర్తు వ‌స్తున్నారు. అంత‌గా ఫేమ‌స్ అయిపోయింది ఈ షో. ఇప్పుడు సీజ‌న్ 2 కూడా మొద‌ల‌వుతుంది. ఇదిలా ఉంటే సెకండ్ సీజ‌న్ కోసం చాలా మంది సెలెబ్రెటీస్ ను తీసుకొస్తున్నారు. తొలి సీజ‌న్ లో అంతా సి గ్రేడ్ ఆర్టిస్టుల‌ను తీసుకొచ్చారు.. అస్స‌లు స్టార్ ఇమేజ్ లేదు.. గుర్తు కూడా ప‌ట్ట‌ని వాళ్ల‌ని ప‌ట్టుకొచ్చార‌నే విమ‌ర్శ ఉంది. అయితే ఎన్టీఆర్ ఇమేజ్ తో అది అలా న‌డిచిపోయింది. కానీ రెండో సీజ‌న్ కు మాత్రం అదిరిపోయే స్టార్ క్యాస్ట్ తీసుకొ స్తున్నారు. ముందుగా ఇందులో నిన్న‌టి త‌రం ల‌వ‌ర్ బాయ్ త‌ర‌ణ్ ఉన్న‌ట్లు తెలుస్తుంది. మ‌నోడు కాంట్ర‌వ‌ర్సీల్లో కూడా బాగానే ఉంటాడు. అత‌డితో పాటే వ‌రుణ్ సందేశ్.. అల్ల‌రి న‌రేష్ అన్న‌య్య ఆర్య‌న్ రాజేష్.. ధ‌న్య బాల‌కృష్ణ‌న్.. మంజుల కూతురు శ్రీ‌దేవి.. యాంక‌ర్ శ్యామ‌ల‌.. అప్ప‌టి హీరోయిన్ గ‌జాలా.. సీనియ‌ర్ హీరోయిన్ రాశీ.. యాంక‌ర్ లాస్య‌.. సెన్సేష‌న‌ల్ శ్రీ‌రెడ్డి.. హీరోయిన్ ఛార్మి.. సింగ‌ర్ గీతామాధురి ఉన్న‌ట్లు తెలుస్తుంది. జూన్ 10 నుంచి మొద‌లు కాబోయే ఈ షో 100 రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. 16 మంది సెలెబ్రెటీస్ ఇందులో ఉంటారు. మ‌రి చూడాలిక‌.. రెండో సీజ‌న్ కూడా తొలి సీజ‌న్ మాదిరి హిట్ అవుతుందో లేదో..? 

More Related Stories